నందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పటి వరకు తన కెరియర్లో చాలా ఇండస్ట్రీ హిట్ మూవీలలో నటించాడు. ఇకపోతే బాలయ్యకు ఓ దర్శకుడు 2 ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చాడు. అలాంటి దర్శకుడితో బాలయ్యమూవీ ని మొదలు పెట్టాడు. కానీ ఆ తర్వాత ఆ సినిమా ఆగిపోయింది. ఆ దర్శకుడు ఎవరు ..? ఆ సినిమా ఎందుకు ఆగిపోయింది వివరాలను తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న దర్శకులలో బి.గోపాల్ ఒకరు. ఈయన బాలకృష్ణ హీరోగా మొత్తం ఐదు సినిమాలను రూపొందించాడు.

అందులో లారీ డ్రైవర్ , రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాయి. ఇక ఆ తర్వాత వచ్చిన సమర సింహా రెడ్డి , నరసింహ నాయుడు సినిమాలు ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. వీరి కాంబినేషన్లో ఐదవ సినిమాగా పలనాటి బ్రహ్మనాయుడు అనే మూవీ వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే వీరి కాంబో లో ఆరవ సినిమాగా హరహర మహాదేవ అనే మూవీ స్టార్ట్ అయింది. కాకపోతే ఈ సినిమా ఆ తర్వాత ఆగిపోయింది.

ఒక ఓ ఇంటర్వ్యూ లో ఈ మూవీ దర్శకుడు అయినటువంటి బి గోపాల్ మాట్లాడుతూ ... ఆ సినిమాను కథ లేకుండానే మొదలు పెట్టాం. ఆ తర్వాత కథ సెట్ చేద్దాం అనుకున్నాం. కానీ సెట్ కాలేదు. చిన్ని కృష్ణ దగ్గర ఒక కథ ఉంది అంటే దానిని కూడా విన్నాం. కానీ అది పెద్దగా నచ్చలేదు. అలా ఎంత ప్రయత్నం చేసినా ఆ సినిమాకు కథ దొరకపోవడంతో ఆ మూవీ ని ఆపివేశం అని బి గోపాల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: