సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా రూపొందిన ఆఖరి 5 మూవీ ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

రజనీ కాంత్ తాజాగా వెట్టాయన్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాను అక్టోబర్ 10 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 160 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రస్తుతానికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో , ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

రజనీ కాంత్ కొంత కాలం క్రితం జైలర్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకొని సూపర్ సాలిడ్ కలెక్షన్లను చేసింది. ఈ సినిమాకు 122.55 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

రజనీ కాంత్ కొంత కాలం క్రితం అన్నాత్తే అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 110 కోట్ల ప్రీ రిలీజ్ చేసిన జరిగింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

సూపర్ స్టార్ రజనీ కాంత్ కొంత కాలం క్రితం దర్బార్ అనే సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకోలేక పోయింది. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 146.05 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

రజనీ కాంత్ కొంత కాలం క్రితం పేటా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 124.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: