తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ ఇటీవల నాగచైతన్య, సమంతల విడాకుల గురించి షాకింగ్ అలిగేషన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఇంకా ఈ వివాదం సద్దుమనగ లేదు. ఈ వ్యవహారం చల్లారలేదు. ఇలాంటి సమయంలో అగ్రతార సమంత మొదటిసారి కనిపించింది. హైదరాబాద్‌లో జరిగిన ఆలియా భట్ మూవీ 'జిగ్రా' చిత్ర ప్రమోషన్ ఈవెంట్‌లో సమంత పాల్గొన్నది. స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఈవెంట్ కు విచ్చేశాడు. ఈ మాటల మాంత్రికుడు  ఈవెంట్ లో మాట్లాడుతూ సమంతను ప్రశంసించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఈవెంట్‌కు రణదీప్ హుస్సేన్, ఆలియా భట్ కూడా హాజరయ్యారు.

త్రివిక్రమ్ శర్మ మాట్లాడుతూ, సమంతకు దేశవ్యాప్తంగా రజనీకాంత్ కు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పారు. ఇదేదో ఆమెపై తనకి ఉన్న ప్రేమ వల్ల చెప్పడం లేదని, ఇదే వాస్తవమని స్పష్టం చేశారు. అయితే సమంతను త్రివిక్రమ్ ఇలా ఆకాశానికి ఎత్తేయడంతో  ఆమె వెరైటీగా రియాక్షన్ ఇచ్చింది. చాల్లేండి శ్రీను గారు మీ పొగడ్తలు అన్నట్లు ఆమె ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది.


ఈ క్లిప్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసి సమంత విచిత్రంగా రియాక్ట్ అయిందని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. గురూజీ బాగా సొల్లు చెప్తాడు అని దారుణంగా విమర్శిస్తున్నారు కూడా. ఇది మరీ టూమచ్ గా అనిపించడం లేదా అని మరి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. గురూజీ ఏమైనా తాగి వచ్చారా అని ఇంకొందరు అడుగుతున్నారు. మరి కొంతమంది నవ్వుకుంటున్నారు.

 ఏది ఏమైనా త్రివిక్రమ్ మాట్లాడే విధానం ప్రత్యేకమైనది కాబట్టి ఆయన మాటలకు ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈసారి కూడా ఆయన తన మాటలు కొందరిని ఆకట్టుకున్నాయి. ఈ స్టార్ డైరెక్టర్ సమంతతో కలిసి మూడు సినిమాలు చేశాడు. మళ్లీ చాలా రోజులకు ఆమెను చూడడం తనకు ఆనందంగా ఉందని అన్నాడు. సమంత పేరుకే హీరోయిన్ కానీ సినిమాలో ఆమె నిజమైన హీరో అంటూ మరింత పొగడ్తల వర్షం కురిపించాడు. సమంతకి అల్లు అర్జున్ పెద్ద ఫ్యాన్ ని కూడా అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: