సినిమాలు ఎంతో గొప్పగా రూపొందించాం అనే దాని కంటే కూడా సినిమాను ఏ తేదీన విడుదల చేసాం అనేది కూడా చాలా ముఖ్యమైన పాయింట్. సినిమాని గొప్పగా రూపొందించిన కూడా సరైన సమయంలో విడుదల చేయనట్లయితే సినిమా బాగున్న కూడా జనాలు థియేటర్లకు వచ్చే అవకాశాలు ఉండవు. అందుకే సినిమా విడుదల విషయంలో ఎక్కువ హాలిడేస్ ఉండి జనాలు అంతా థియేటర్లకు వస్తారు అనే అవకాశం ఉన్న తేదీలనే మేకర్స్ ఫిక్స్ చేస్తూ ఉంటారు. అలాంటి తేదీలలో అయితే సినిమాకు మంచి టాక్ వచ్చినట్లయితే లాంగ్ రన్ లో కూడా ఉండే మూవీ కి మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది.

ఇకపోతే కొంత కాలం క్రితం పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజి సినిమాను సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ పెండింగ్ ఉండడంతో ఈ మూవీ బృందం ఈ సినిమా విడుదలను పోస్ట్ ఫోన్ చేసింది. దానితో ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేశారు.

ఇక ఈ మూవీ వచ్చినా కూడా ఈ మూవీ విడుదల అయిన తర్వాత చాలా హాలి డేస్ రావడం , ఆ తర్వాత దసరా హాలి డేస్ కూడా ఈ మూవీ కి కలిసి రావడంతో ఈ సినిమా ఇప్పటికే భారీ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది. దీనితో పవన్ అభిమానులు చాలా మంది ఓజి మూవీ ని త్వరగా పూర్తి చేసే సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేసి ఉంటే ఆ మూవీ కి కూడా అద్భుతమైన కలెక్షన్లు వచ్చేవి అనవసరంగా సినిమా షూటింగ్ను డిలే చేశారు అనే అభిప్రాయాన్ని పవన్ అభిమానులు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: