* గౌతమీ పుత్ర శాతకర్ణతో బాలయ్య రచ్చ
* ఖైదీ 150 సినిమాతో మెగా కలెక్షన్స్‌
* శతమానం భవతితో ఫ్యామిలీని ఆకట్టుకున్న శర్వనంద్‌



టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు అన్నిటికీ సంక్రాంతి పండుగ చాలా సెంటిమెంట్. సంక్రాంతి సమయంలో.. విడుదలయ్య సినిమాలు కచ్చితంగా హిట్ అవుతాయి. పండగ సెలవులు ఆ సమయంలో ఉండటంతో చాలామంది సినిమాలు చూసేందుకు ఎగబడతారు. అందుకే సంక్రాంతి పండుగను టాలీవుడ్ హీరోలు చాలా వరకు నమ్ముతారు. అయితే 2017 సమయంలో... వచ్చిన సంక్రాంతి సందర్భంగా కూడా చాలా సినిమాలే వచ్చాయి.


అయితే 2017 సంక్రాంతి సమయంలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలయ్య, శర్వానంద్ మధ్య పోటీ జరిగింది. అయితే ఈ మూడు సినిమాలు దాదాపు మంచి కలెక్షన్స్ రాబట్టగలిగాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఖైదీ నెంబర్ 150  తీశాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత ఆల్ టైం అత్యధిక ఓపెనింగ్ కూడా ఈ సినిమా అందుకుంది.


చిరంజీవి నటించిన ఖైదీ 150 సినిమా బడ్జెట్ 65 కోట్లు ఉంటే... తెలంగాణ అలాగే ఏపీ రాష్ట్రాలలో దాదాపు 30 కోట్ల గ్రాస్ సంపాదించింది. ఓవరాల్గా ఈ సినిమా దాదాపు 150 కోట్ల వరకు సంపాదించినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక ఆటో బాలయ్య నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణ... వంద రోజులు  ఆడి చరిత్ర సృష్టించింది. వాస్తవంగా ఈ సినిమాను 55 కోట్లతో తీశారట. సినిమా మంచి విజయం రావడంతో.. నిర్మాతకు 77 కోట్లు తిరిగి వచ్చాయట.


ఇక హీరో శర్వానంద్ సంక్రాంతి బరిలో అదే సమయంలో వచ్చాడు. ఫ్యామిలీ ఎంటర్టైన్గా తెరకెక్కిన శతమానం భవతి... 2017 సంక్రాంతికి రిలీజ్ అయింది. ఈ సినిమా బడ్జెట్ 8 కోట్లు అయితే... బాక్సాఫీస్ కలెక్షన్స్ 55 కోట్లుగా నిలిచింది. అంటే బాలయ్య అటు చిరంజీవి లాంటి పెద్ద హీరోలను తట్టుకొని కూడా ఈ సినిమా నిలవడం జరిగింది.  ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో బాగా ఉండటంతో సక్సెస్ అయిందని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: