తెలుగు సినీ పరిశ్రమ మొదట చెన్నై ఫిలిం ఇండస్ట్రీ నుంచి హైదరాబాదుకి తరలించడానికి చాలామంది సెలబ్రిటీల  కృషి ఉందని చెప్పవచ్చు. అయితే 1980లో చెన్నై ఫిలిం ఇండస్ట్రీ చాలా మంది బడా టెక్నీషియన్ లతో చాలా అప్డేట్ గా ఉండేదట. తమిళ చిత్రాలకు దీటుగానే చాలానే తెలుగు సినిమాలను భారీ హంగామా తో విడుదల చేసేవారట.అయితే తెలుగు సినిమా పరిశ్రమ తరిమిళనాడు నుంచి హైదరాబాద్ కి వచ్చేయడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కోసం కృషి చేసిన వారిలో ఎన్టీఆర్ ,కృష్ణ ,ఏఎన్ఆర్, శోభన్ బాబు తదితర హీరోలు ఉన్నారని కూడా చెప్పవచ్చు. వీరితో పాటు చాలామంది దర్శక నిర్మాతలు కూడా ఉన్నారు.


ముఖ్యంగా కృష్ణ ఫ్యామిలీ పద్మాలయ స్టూడియో, అక్కినేని ఏఎన్ఆర్ స్టూడియో తో పాటుగా చాలానే ప్రొడక్షన్ హౌస్ లు కూడా వచ్చేవి. ముఖ్యంగా సురేష్ ప్రొడక్షన్ అప్పట్లో కొన్ని వందల బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు. అయితే అప్పట్లో హీరోల రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉండేదట. ఎన్టీఆర్ వంటి సినిమాలకి 50 లక్షల రూపాయలు హైయెస్ట్ బడ్జెట్ ఉండేదట. సీనియర్ ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ విషయంలో కూడా టాప్ లో ఉండేవారని సమాచారం.


సీనియర్ ఎన్టీఆర్ ఒకో చిత్రానికి 12 లక్షల రూపాయలు అందుకునే వారట.. ఏఎన్ఆర్ 30 నుంచి 40 లక్షల బడ్జెట్ అయితే రూ .10లక్షల రూపాయలు తీసుకునే వారట..కృష్ణ అయితే 20 నుంచి 30 లక్షల వరకు బడ్జెట్ అయితే 8 లక్షల రూపాయలు అందుకునే వారట.. శోభన్ బాబు 20 నుంచి 25 లక్షల రూపాయల బడ్జెట్ అయితే 7లక్షల పైగా తీసుకునే వారట. అప్పట్లో కాస్త బాగా పాపులారిటీ సంపాదించిన హీరో సుమన్ కూడా 17 లక్షల రూపాయలు బడ్జెట్ అయితే 3 లక్షలు తీసుకునే వారట.. చిరంజీవి వంటి హీరోలు 17 లక్షల రూపాయలు బడ్జెట్ పెడితే అందులో 3 లక్షల రూపాయలు మాత్రమే చిరంజీవికి కేటాయించేవారట. దీన్నిబట్టి చూస్తే అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ టాప్ హీరో అని అత్యధిక రెమ్యూనరేషన్ కూడా ఆయన తీసుకునేవారు అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: