కొన్ని సంవత్సరాల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మగధీర అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో దేవ్ గిల్ విలన్ పాత్రలో నటించగా ... శ్రీహరి ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇక శ్రీహరి కి లవర్ పాత్రలో ఈ మూవీ లో సలోని నటించింది. ఈ సినిమాలో సలోని పాత్ర నిడివి చాలా తక్కువే అయినప్పటికీ ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్లను వసూలు చేసి ఏకంగా ఇండస్ట్రీ హిట్ ను సాధించడంతో ఈ మూవీ ద్వారా సలోని కి మంచి గుర్తింపు లభించింది.

ఇకపోతే ఈ సినిమాలో సలోని పాత్ర కోసం మొదట రాజమౌళి మరో ముద్దుగుమ్మను అనుకున్నాడట. కానీ ఆ నటి ఆ పాత్ర చేయను అని రిజెక్ట్ చేయడంతో ఆ తర్వాత రాజమౌళి , సలోని నీ ఎంచుకున్నాడట. మరి ఆ ముద్దుగుమ్మ ఎవరు ..? అనే వివరాలను తెలుసుకుందాం. టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటిగా చాలా సంవత్సరాల పాటు కెరీర్ను కొనసాగించిన వారిలో అర్చన ఒకరు. ఈమె చాలా సినిమాలలో హీరోయిన్ పాత్రలో నటించింది. అలాగే కొన్ని సినిమాల్లో ముఖ్య పాత్రలలో , కీలక పాత్రలలో కూడా నటించింది.

ఇకపోతే అర్చన ను రాజమౌళి మొదట మగధీర సినిమాలో సలోని పాత్ర కోసం ఎంచుకున్నాడట. అందులో భాగంగా ఈమెను సంప్రదించి కథను కూడా వివరించాడట. కానీ ఈమె మాత్రం ఆ సినిమాలో నటించను అని చెప్పిందట. ఇక ఒక ఇంటర్వ్యూలో భాగంగా మగధీర సినిమాలో అవకాశాన్ని అనవసరంగా వదులుకున్నాను అని ఆ టైమ్ లో ఆ సినిమా చేసి ఉంటే బాగుండేది అని ఈమె చెప్పుకొచ్చింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం అర్చన ఏ సినిమాల్లో కూడా నటించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: