ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇంతలోనే మరో పెద్ద ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రేమకథ చేయబోతున్నారు. ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా, ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక గోపిచంద్‌ను కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం సంప్రదించారు. గతంలో ప్రభాస్ సినిమాల్లో గోపిచంద్ విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా ‘ఫౌజీ’ 1940ల కాలంలో జరిగే కథ. ఈ సినిమాలో మనం పాత కాలపు వాతావరణాన్ని, ఆ కాలపు వస్త్రాలు, ఆచార వ్యవహారాలు అన్నీ చూపించనున్నారు.

ఇందులో సీనియర్ నటి జయప్రద కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఆమె ఎలాంటి పాత్ర చేస్తున్నారో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. ఈ సినిమాలో యుద్ధం, ప్రేమ, భావోద్వేగాలు కలిసి ఒక అద్భుతమైన కథను చెప్పబోతున్నారు. అంటే, యుద్ధం నేపథ్యంలో ప్రేమ ఎలా పుడుతుంది, అది ఎలా అభివృద్ధి చెందుతుంది అనే విషయాలను ఈ సినిమా చూపించబోతుంది.

 అయితే ఇవన్నీ కాదు ఇప్పుడు ప్రభాస్ అభిమానులకు ఒక పండగ లాంటి వార్త వచ్చింది. ఎందుకంటే వారి ఫేవరెట్ హీరో ప్రభాస్‌తో పాటు, గోపిచంద్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నాడు. గోపిచంద్ మొదట విలన్‌గా కెరీర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. త్వరలో ప్రభాస్ సినిమాలో మళ్లీ ప్రతి నాయకుడిగా కనిపించనున్నాడట. ఆయన ‘జయం’, ‘నిజం’ లాంటి సినిమాల్లో విలన్‌గా నటించి ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత హీరోగా మారి ‘యజ్ఞం’, ‘అంద్రుడు’, ‘రణం’ లాంటి సినిమాల్లో నటించి విజయం సాధించారు. ప్రభాస్ గోపీచంద్ చాలా మంచి ఫ్రెండ్స్ వీరిద్దరూ వర్షం సినిమాలో స్నేహితుల అయ్యారు. వారి ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్షిప్ చూడ్డానికి ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది ఇప్పుడు వీరిద్దరూ ఒకే సినిమాలో కలిసి నటించబోతున్నారని తెలిసి ఫ్యాన్స్ బాగా ఎగ్జైట్  అవుతున్నారు.

గోపిచంద్ నటించిన 'సౌఖ్యం', 'గౌతమ్ నంద', 'ఆక్సిజన్', 'పంతం', 'సీటిమార్', 'పక్క కమర్షియల్' లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయినప్పటికీ, 'గౌతమ్ నంద' సినిమా ద్వారా ఆయన మంచి నటుడు అని ప్రేక్షకులు గుర్తించారు. ఇటీవల కాలంలో గోపిచంద్ ఎలాంటి కొత్త సినిమా ప్రాజెక్ట్‌ల గురించి ప్రకటించలేదు. దీంతో ఆయన అభిమానులు ఆయన త్వరలోనే మంచి హిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారని ఆశతో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: