ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ క్రేజీ సీక్వెల్ మూవీ డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. అయితే, ఈ సినిమా రిలీజ్‌కు ఇంకా 50 రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇదే విషయాన్ని తాజాగా ఓ కొత్త పోస్టర్ ద్వారా తెలియజేశారు. పుష్ప రాజ్ సీరియస్ మోడ్‌లో కూర్చున్న పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

బ్యాక్‌గ్రౌండ్‌లో పుష్పరాజ్ బ్రాండ్ మార్క్ అయిన చేతి గుర్తు మనకు కనిపిస్తుంది. ఇలా ఈ సరికొత్త పోస్టర్ ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకోవడంతో, ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోతున్నాయి.ఇక ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్నపుష్ప ది రూల్‌ చిత్రం ఇప్పటికే వెయ్యి కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ పూర్తిచేసుకుందని ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. దేవిశ్రీప్రసాద్‌ సంగీత సారథ్యంలో రూపొందిన రెండు పాటలను ఇప్పటికే విడుదల చేశారు. ఆ లిరికల్ వీడియోలకు అనూహ్యమైన స్పంద వచ్చింది. బ్యాలెన్స్‌గా వున్న రెండు పాటలను నవంబరులో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

 దీంతో పాటు పుష్ప-2 ప్రమోషనల్‌ ప్లాన్‌ కూడా నిర్మాతలు రెడీ చేశారని, త్వరలోనే పుష్ప-2 అగ్రెసివ్‌ ప్రమోషన్స్  మొదలుపెడతారని సమాచారం.  అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తోంద సినిమా పుష్ప 2. ఈ చిత్రం మొదటి భాగం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 500 కోట్ల పైగా కలెక్షన్ సాధించి ‌.. అప్పట్లో ఒక సంచలన చిత్రంగా మిగిలింది. అంతేకాదు ఈ సినిమా అల్లు అర్జున్ రేంజ్ ని ప్రపంచవ్యాప్తంగా వేరే లెవెల్ కి తీసుకెళ్ళింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: