మెగా స్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ ‘భోళాశంకర్’ ఫెయిల్ అవ్వడంతో ఎలర్ట్ అయిన చిరు తన భవిష్యత్ సినిమాల వ్యూహాలలో మార్పులు చేసుకుని అప్పటి వరకు ఓకె చేసిన కళ్యాణ్ కృష్ణ మూవీని పక్కకు పెట్టి వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ కు ఓకె చేసిన విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈ మూవీ పంచభూతాల కాన్సెప్ట్ పై కథను అల్లారు.



ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీని నిన్న మొన్నటివరకు సంక్రాంతికి విడుదల అని అనుకున్నారు. అయితే ఈ మూవీ విడుదల ఇప్పుడు సమ్మర్ కు వాయిదా పడింది అన్న వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య లేటెస్ట్ గా ఈమూవీకి సంబంధించి విడుదలైన టీజర్ కు మిశ్రమ స్పందన రావడం చిరంజీవి దృష్టి వరకు వెళ్ళిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.



‘విశ్వంభర’ టీజర్ కు సంబంధించిన గ్రాఫిక్స్ క్వాలిటీ పెద్దగా గొప్పగా లేవనీ ఈ టీజర్ చూసిన వారు పెదవి విరుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గ్రాఫిక్స్ విషయంలో ఏమాత్రం క్వాలిటీ లేకపోయినా అది టాప్ హీరో సినిమా అయినప్పటికీ సాధారణ ప్రేక్షకుడి దగ్గర నుంచి విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాలు అన్నీ ఈమూవీ బయ్యర్ల వరకు రావడంతో ఎలర్ట్ అయిన ఈమూవీ నిర్మాతలు గ్రాఫిక్స్ విషయమై పూర్తిగా శ్రద్ధ పెట్టాలని అభిప్రాయపడి కొంతమంది ప్రముఖ గ్రాఫిక్స్ డిజైనర్స్ తో చర్చలు జరుపుతున్నట్లు టాక్.



ఇహ చిరంజీవి కూడ మరో ఫెయిల్యూర్ తనను వెంటాడ కూడదని ఈమూవీ నిర్మాతలతో దర్శకులతో మాట్లాడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈసినిమా వచ్చే సంవత్సరం జనవరి సంక్రాంతి పండుగ ముందు విడుదల అయ్యేలా ఆలోచనలు ఉన్నప్పటికీ వాటిని పక్కకు పెట్టి ఈమూవీలోని గ్రాఫిక్స్ వర్క్స్ క్వాలిటీ పై చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి తనకు తెలిసిన ప్రముఖ దర్శకులతో ఈమూవీలోని గ్రాఫిక్స్ క్వాలిటీ పై చాల లోతైన చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: