. . . ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సంక్రాంతి కి గుంటూరు కారం సినిమా తో ప్రేక్షకుల ముందు కు వచ్చి నిరాశపరిచారు .. అయితే ప్రస్తుతం మహేష్ తన తర్వాత సినిమాని దర్శక ధీరుడు రాజమౌళి తో చేయడానికి రెడీ అయ్యాడు . ఇప్పటికే రచయిత విజేంద్రప్రసాద్ ఈ సినిమా కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేశాడు . వచ్చే సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానందాన్ని కూడా అంటున్నారు . అలాగే ఈ సినిమా ని కూడా రాజమౌళి బాహుబలి సినిమాల లాగా రెండు భాగాలు గా తెర‌కెక్కించునాడు .


అదే విధంగా హాలీవుడ్ రేంజ్ లో భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సినిమా రానుంది .అయితే ఎప్పుడూ మహేష్ - రాజమౌళి సినిమా కన్నా ముందే మ‌రో యువ దర్శకుడు తో ఓ సినిమా చేయడాని కి రెడీ అవుతున్నారనే వార్త వైరల్ గాా మారింది .. ప్రభాస్ కూడా బాహుబలి సినిమాల కన్నా ముందు మిర్చి సినిమా తో ప్రేక్షకులు ముందుకు వచ్చి బంపర్ హిట్ అందుకున్నాడు . ఇప్పుడు మహేష్ కూడా అలానే యువ దర్శకుడు తో సినిమా చేయడానికి ఓకే చెప్పాడట .


అలాగే ఆ సినిమా కథ నచ్చడంతో ఆయనే నిర్మించాలని కూడా అనుకుంటున్నారట . ఇదే విషయాన్ని రాజమౌళి కి  కూడా చెప్పడంతో ఆయన కూడా సినిమా చేయడానికి ఓకే చెప్పారని కూడా మహేష్ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం . వచ్చే ఫిబ్రవరి లోపు ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసి సమ్మర్ చివర్లో ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట . ఇక మరి దీనిపై మహేష్ దగ్గర నుంచి ఎలాంటి ప్రకటన వస్తుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: