- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . .

నందమూరి నటసింహం బాలకృష్ణ కెరీర్ ప‌రంగా ప్ర‌స్తుతం తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. అఖండ - వీర‌సింహారెడ్డి - భ‌గ‌వంత్ కేస‌రి మూడు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. అస‌లు బాల‌య్య సినిమా వ‌స్తోందంటే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర హంగామా మామూలుగా లేదు. ప్ర‌స్తుతం బాల‌య్య లైన ప్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ క్ర‌మంలోనే బాల‌య్య హీరోగా దర్శకుడు కొల్లి బాబీతో చేస్తున్న భారీ యాక్షన్ సినిమా గురించి అందరికీ తెలిసిందే.


సినిమా బాలయ్య కెరీర్ లో 109వ సినిమాగా రాబోతుండగా భారీ హైప్ దీనిపై నెలకొంది. ఇక చిరంజీవి తో సంక్రాంతి కానుక‌గా వాల్తేరు వీర‌య్య లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాను తెర‌కెక్కించిన త‌ర్వాత ఫామ్ లోకి వ‌చ్చిన బాబి ఇప్పుడు వెంట‌నే బాల‌య్య తో ఈ క్రేజీ ప్రాజెక్టు ను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టు నుంచి ఈ దీపావళి కానుకగా క్రేజీ అప్డేట్స్ కూడా రాబోతున్నాయి.


సినిమా ను ముందు నుంచి వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయాల‌ని చూస్తున్నారు. అయితే సంక్రాంతి బరిలో ఎప్పుడు ఈ సినిమా రిలీజ్‌ అనే దానికి స‌రైన క్లారిటీ లేదు. ఇక లేటెస్ట్ స‌మాచారం ప్రకారం రెండు డేట్లు ఇప్పుడు బాల‌య్య 109 కోసం అయితే పరిశీలనలో ఉన్నాయట. జనవరి 9 లేదా 12 తేదీలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. బాల‌య్య కు ముహూర్తాల ప‌ట్టింపు బాగా ఎక్కువ . రిలీజ్ డేట్ ఏది క‌న్ ఫార్మ్ చేయాల‌న్నా ముందుగా బాల‌య్య తో ఓ మాట చెప్పాల్సి ఉంటుంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: