మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం రంగస్థలం అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల ఆయన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రోజు పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ప్రశంసలు వెల్లువెత్తాయి. అలాగే ఈ సినిమాలో సమంత కూడా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక సుకుమార్ తన దర్శకత్వ ప్రతిభతో ఈ సినిమాను అద్భుతమైన స్థాయి కి తీసుకువెళ్లాడు. మొత్తంగా ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో రామ్ చరణ్ , సమంత జోడి కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తర్వాత కూడా వీరిద్దరి కాంబో లో ఓ సినిమా వస్తే బాగుంటుంది అనుకున్న ప్రేక్షకులు కూడా చాలా మందే ఉన్నారు. ఇకపోతే అలాంటి సమయం మరికొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తాజాగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజర్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇక రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీ గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ మూవీ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ను హీరోయిన్గా ఇప్పటికే ఎంపిక చేసుకున్నారు. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దానిలో సమంత ను మేకర్స్ ఓకే చేసినట్లు , ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే బయటకు రానున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: