టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ గురించి జనాలకి చెప్పాల్సిన పని లేదు. తెలుగులో ఫాన్స్ తో సంబంధం లేకుండా ఆడే సినిమాలు ఆయనవే అని చెప్పుకోవచ్చు. ఇక ఆయన అనేక కుటుంబకథా చిత్రాలు చేయడంతో మహిళలు వెంకీ మామ సినిమాలను బాగా ఇష్టపడతారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో వైవిధ్యమైన సినిమాలు, రకరకాల పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. అందుకే ఇప్పటికీ ఆయన సినిమాలంటే జనాలలో చెప్పలేనంత క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు ఆయన ఓ వైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్స్ తో కలిసి నటించారు కూడా.

ఇకపోతే, సోషల్ మీడియాలో వెంకటేష్ కు సంబందించిన ఓ ఓల్డ్ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో వెంకేతో పాటుగా ఓ స్టార్ హీరో ఉండడం మీరు గమనించవచ్చు. మీరు చూస్తున్నది వెంకటేష్ నటించిన ఒకప్పటి సినిమా షూటింగ్ లోని ఫోటో. ఆ ఫొటోలో వెంకటేష్ కాకుండా ఓ స్టార్ హీరో అలాగే ఓ స్టార్ డైరెక్టర్ కూడా ఉన్నారు. మీరు గురుపట్టలేదు కదూ! అస్సలు గుర్తుపట్టలేరు. ఎందుకంటే అంతలా వారు మారిపోయారు కాబట్టి. ఇపుడు ఒకరేమో స్టార్ హీరోగా వెలుగొందితే, మరొకరు టాప్ దర్శకుడిగా దూసుకుపోతున్నారు. ఇంతకు ఆ ఇద్దరు ఎవరో కనిపెట్టరా?

వాళ్ళు మరెవ్వరో కాదు... పై ఫొటోలో నవ్వుతూ కనిపిస్తున్న పిల్లాడు హీరో రామ్ పోతినేని కాగా రెండో సర్కిల్ లో ఉన్నది మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఇప్పుడు ఈ త్రో బ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడం విశేషం. రామ్ తో కలిసి వెంకటేష్ మసాలా అనే సినిమా చేశారు గుర్తుందా? అలాగే త్రివిక్రమ్ వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు మాటలు రాయడం జరిగింది. అదన్నమాట సంగతి. ఇక వెంకటేష్ ఇప్పటికి కూడా యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా వెలుగొందిన వెంకీ మామ ఇపుడు 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు. రానా నాయుడు సీజన్ 1 తరువాత సీజన్ 2 షురూ చేయడానికి వెంకీ మామ సన్నద్ధం అవుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: