తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర పార్ట్ 1 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే 500 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి 600 కోట్లకు దగ్గరగా ఉంది. ఇకపోతే ఈ సినిమాలో ఆయుధ పూజ సాంగ్ ఉన్న విషయం మనకు తెలిసిందే.

ఈ సాంగ్లో కొంత సమయం పాటు జూనియర్ ఎన్టీఆర్ చెయ్యి వెనక్కు పెట్టుకొని ఓ స్టెప్ వేస్తూ ఉంటాడు. ఇక డాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా తారక్ చేయు వెనక్కి పెట్టుకొని స్టెప్ ను కంపోజ్ చేసి ఉంటాడు. అందుకే ఇలా చేశాడు అని అనుకున్నారు. కానీ అలా చెయ్యి వెనక్కి పెట్టి స్టెప్పు వేయడానికి ఒక పెద్ద కారణం ఉందట. అసలు విషయం లోకి వెళితే ... ఈ సాంగ్ షూటింగ్ కొంత భాగం పూర్తి అయిన తర్వాత తారక్ చేతికి బలమైన గాయం తగిలిందట. దానితో ఆయన చేతికి కట్టు కట్టుకొని ఉండవలసిన అవసరం వచ్చిందట.

ఇక డాన్స్ చేసేటప్పుడు ఆ కట్టు బయటికి కనిపిస్తే బాగోదు అనే ఉద్దేశంతో డాన్స్ మాస్టర్ చెయ్యి వెనక్కు పెట్టుకొని స్టెప్ వేసే విధంగా డాన్స్ స్టెప్ ను కంపోజ్ చేశాడట. దానితో తారక్ డాన్స్ వేసేటప్పుడు చెయ్యి వెనక్కి పెట్టుకోవడం మాత్రమే కాకుండా కట్టు ఏమాత్రం కనబడకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసమే తారక్ ఆయుధ పూజ సాంగ్ లో చెయ్యి వెనక్కి పెట్టే స్టెప్ ను వేసినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: