పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు.. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో ఏకంగా 5 సినిమాలు వున్నాయి..అయితే ఆ సినిమాలన్నీ కూడా డిఫరెంట్ జానర్స్ కావడం విశేషం..బాహుబలి సినిమాతో పాన్ ఇండియా వైడ్ భారీ ఇమేజ్ సంపాదించుకున్న ప్రభాస్ తన తరువాత సినిమాలతో కూడా అదే జోరు చూపిస్తున్నాడు.. ప్రభాస్ ఇటీవల నటించిన “కల్కి 2898 Ad “ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ప్రభాస్ కెరీర్ లో మరో మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోయింది..తరువాత రాబోయే సినిమాలతో కూడా ప్రభాస్ సంచలనం సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు..ఇదిలా ఉంటే తాను నటించిన సినిమాలలో ప్రభాస్ కి ఫేవరెట్ సాంగ్ గురించి ఆసక్తికర చర్చ మొదలయింది.. తాజాగా సిరివెన్నెల సీతారామశాస్త్రిని స్మరిస్తూ ఈ టీవీ ఛానల్ 'నా ఉఛ్వాసం కవనం' అనే ఓ ఇంటర్వ్యూ సిరీస్ ను చేస్తుంది. ఈ ఇంటర్వ్యూకి తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రావడం జరిగింది...
ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఇంటర్వ్యూ పార్ట్ 1ను ఈటీవీ విన్ లో విడుదల చేసారు... ఇందులో సిరివెన్నెల గారితో తనకు వున్న అనుబంధం గురించి ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు..నా మొదటి సినిమా ఈశ్వర్ సమయంలో లిరిక్స్ గురించి అంత అవగాహన లేదు. నా ఫస్ట్ మూవీలో సాంగ్స్ కూడా కూడా సిరివెన్నెల గారు రాశారని నేను విన్నాను కానీ ఆయన్ని అప్పటివరకు కలవలేదు. మొదటిసారి ఆయన్ని వర్షం సినిమా సమయంలో కలిసినట్లు ప్రభాస్ తెలిపారు...నిర్మాత MS రాజు గారి ఆఫీస్‌లో సీతారామశాస్త్రి గారిని మొదటిసారి కలిసానని ప్రభాస్ తెలిపారు.. వర్షం సినిమా కోసం ఆయన రాసిన పాట తన బేస్ వాయిస్‌తో 'మెల్లగా కరగని..' అని వినిపించారు. దాంతో ఈ సాంగ్ పోయినట్టే, ఈ పాట ఏదో తేడాగా ఉందని అనుకున్నాను.నేను దేవిశ్రీ కలిసి ఈ వర్షం సాక్షిగా ప్లేస్‌లో ఐ లవ్ యు శైలజ అనే లిరిక్ ను ఉంచాము.. కానీ చివరకు సిరివెన్నెల గారు రాసిన సాంగ్ రికార్డ్ అయ్యాక విన్నాము. ఆ తర్వాత మెల్లగా కరగని.. సాంగ్ నా ఫేవరేట్ సాంగ్ అయిపోయిందని ప్రభాస్ చెప్పుకొచ్చారు.