నందమూరి నట సింహం బాలకృష్ణ తన కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ మూవీలలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక బాలయ్యకు అదిరిపోయే రేంజ్ విజయాలను ఇచ్చిన దర్శకులలో బి గోపాల్ ఒకరు. గోపాల్ , బాలకృష్ణ తో మొదటగా లారీ డ్రైవర్ అనే సినిమాను రూపొందించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయింది. ఆ తర్వాత వీరి కాంబోలో రౌడీ ఇన్స్పెక్టర్ అనే మూవీ వచ్చింది. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో నెక్స్ట్ మూవీ రావడానికి చాలా సమయం పట్టింది.

చాలా కాలం తర్వాత వీరి కాంబో లో సమరసింహా రెడ్డి అనే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ వచ్చింది. ఈ సినిమా ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ అయింది. ఆ తర్వాత తక్కువ గ్యాప్ లోనే వీరి కాంబోలో నరసింహ నాయుడు అనే మరో ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వచ్చింది. ఈ సినిమా కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ అయింది. ఇలా వరుసగా నాలుగు విజయాలు వచ్చిన తర్వాత ఐదవ సినిమాగా బి గోపాల్ , బాలకృష్ణ తో పలనాటి బ్రహ్మనాయుడు అనే సినిమాను రూపొందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇక వీరి కాంబోలో ఆరవ సినిమాగా హరహర మహాదేవ అనే సినిమాను లాంచ్ కూడా చేశారు. కానీ అనూహ్యంగా ఈ సినిమా ఆగిపోయింది.

ఇకపోతే బి గోపాల్ ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ ... హరిహర మహాదేవ్ ఆగిపోవడానికి గల కారణాలను చెప్పుకొచ్చాడు. బాలకృష్ణ తో హర హర మహదేవ్ అనే సినిమాను మొదలు పెట్టేటప్పుడు అసలు మా దగ్గర కథ లేదు. కాకపోతే తర్వాత కథ సెట్ చేద్దాం అనుకున్నాం. కానీ అది కుదరలేదు. దానితో కథ ఎంత ట్రై చేసినా దొరకకపోవడంతో బాలయ్య తో ఆ సినిమా చేయలేదు అని బి గోపాల్ ఓ ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: