మన తెలుగు చిత్ర పరిశ్రమ లో సీనియర్ నటుడు మురళీమోహన్ అంటే తెలియని వారు ఉండరు . అందరికీ సుపరిచితులే .. అయితే మురళీమోహన్ తన పేరుని రెండుసార్లు మార్చుకున్నారనే విషయం చాలా మందికి తెలియదు .. అసలు మురళీమోహన్ ఎందుకు తన పేరుని రెండు సార్లు మార్చుకున్నాడు .. అయ‌న‌ ఎందుకు మార్చుకున్నాడు .. ఇంతకీ ఆ పేర్లు ఏంటి .. అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. అప్పుడప్పుడు ఇండస్ట్రీ లో విజయం సాధించాలని సెలబ్రిటీలు తమ పేరు ని మార్చుకుంటూ ఉంటారు . చిరంజీవి , రజినీకాంత్ వంటి అగ్ర హీరోలు కూడా  తమ పేరుని మార్చుకున్న విషయం తెలిసిందే .


ఇక వారి ఆస‌ల పేర్లు వదిలేసి మార్చుకున్న పేరు మీదే వారు పెద్ద హీరోలుగా మరి ఆ పేరుని తమ పేరుగా మార్చుకున్నారు . ఇక సీనియర్ నటుడు మాగంటి మురళీమోహన్ తెలుగు సినిమాల్లో హీరోగా నటించి మెప్పించారు . అప్పట్లో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్నారు . మురళీమోహన్ కేవలం న‌టుడా గానే కాకుండా నిర్మాత గా, రాజకీయ నాయకుడి గా , వ్యాపారవేత్తగా కూడా గుర్తింపు తెచుకున్నారు . అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో గొప్ప కీర్తిని పొందారు. అలాగే 350కు పైగా సినిమాలో నటించారు . అయితే మురళీమోహన్ తన పేరుని రెండుసార్లు మార్చుకున్నారు అన్న విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు .


ముందుగా ఆయన తండ్రి రాజా రామ్మోహన్ రామ్ అని పేరు పెట్టారు. ఆయనకి స్వతంత్ర సమరయోధులు అంటే ఇష్టం అందుకని ఆయనకు ఆ పేరు పెట్టారని అన్నారు .. తర్వాత స్కూల్లో ఇబ్బందిగా ఉందని రాజబాబు గా మార్చుకున్నారట . ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చిన తర్వాత రాజాబాబు కాకుండా మురళీమోహన్ గా పేరు మార్చుకున్నారని అన్నారు . ఈ సీనియర్ హీరో మురళీమోహన్ గా అందరికీ పరిచయం అయ్య‌డు ఆ పేరుతోనే కంటిన్యూ అవుతూ వస్తున్నారు ఇప్పటికీ గొప్ప నటుడుగా పేరు తెచ్చుకొని ఎంతో మంది హృదయాలు గెలుచుకున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: