కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం దేవర. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 27న రిలీజ్ అయ్యింది. మొదట ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అనంతరం ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచేలా భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా చేసింది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రను పోషించారు. వీరితోపాటు ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మురళీ శర్మ వంటి వారు కీలక పాత్రలను పోషించారు.


ఈ సినిమాకు అనిరూధ్ రవిచందర్ సంగీతం అందజేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు అన్నిటినీ కలుపుకొని రూ. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పథకాలపై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం దేవర సినిమా కలెక్షన్లు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.


టాలీవుడ్ లో 2020 సమయంలో సంక్రాంతికి ఎపిక్ కలెక్షన్స్ తో రికార్డులు సాధించిన అలా వైకుంఠపురం సినిమా మొత్తం రన్ లో సాధించిన ప్రాఫిట్స్ ను దేవర క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలా వైకుంఠపురంలో టోటల్ రన్ లో 84.34 కోట్ల బిజినెస్ మీద ఏకంగా 75.8 కోట్ల ప్రాఫిట్స్ ను అందుకుంది. ఇక దేవర సినిమా 182.25 కోట్ల బిజినెస్ మీద ఇప్పటివరకు సాధించిన కలెక్షన్స్ తో 73.15 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్స్ ను బిజినెస్ మీద అందుకుని బీభత్సం సృష్టించారు.

మిగిలిన సమయంలో దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద మరో 2.75 కోట్ల రేంజ్ లోపు షేర్ ని అందుకుంటే అల వైకుంఠపురం సినిమాను క్రాస్ చేసే ఛాన్స్‌ ఉంటుంది. మోస్ట్ ప్రాఫిటబుల్ సినిమాస్ లో ఆల్ టైం టాప్ సిక్స్ ప్లేస్ ను అందుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నానరు. ఇక ఈ విషయం తెలిసి అల వైకుంఠపురం సినిమా యూనిట్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది దేవర సినిమా. అల్లు అర్జున్ సైతం దేవర సినిమా కలెక్షన్లను చూసి షాక్ అవుతున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: