తెలుగు సినీ రంగంలో ఒక శకంలా నిలిచిపోయిన నటి సూర్యకాంతం. ఆమె నటించిన ప్రతి పాత్రలో అమ్మ, అత్త పాత్రలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేది. ఆమె నటనలోని సహజత్వం, భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగు సినీ ప్రేమికులందరికీ ఆమె "తెలుగింటి అత్త"గానే పరిచయం.సూర్యకాంతం నటించిన చిత్రాలు తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయాయి. ఆమె నటించిన చిత్రాల్లో అత్త, అమ్మ, సవతి తల్లి, తోటి కోడలు, భార్య గా ఇలా ఏ పాత్ర చేసిన కూడా గయ్యాలితనానికి అంతా భయపడాల్సిందే. భర్తగా ఎస్వి ఆర్, గుమ్మడి, రేలంగి, రమణ రెడ్డి ఇలా ఎవరన్నా తన నోటికి తలవంచాల్సిందే. ఆమె నటనలోని సూక్ష్మమైన భావాలు, ప్రేక్షకుల హృదయాలను తాకే విధానం ఆమెను అద్వితీయ నటిగా నిలిపింది.
సూర్యకాంతం యొక్క నటన ఎంతో సహజంగా ఉండేది. ఆమె ప్రతి పాత్రలో కలిసిపోయి, అది తనదే అన్నట్లుగా నటించేది. ఆమె నటనలోని నిజాయితీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కల్లిబుల్లి కబుర్లతో తన దొంగ ఏడుపులకు ఆమెకు ఎవరు పోటీ లేరు. చేసిందంతా చేసేసి దిగులుగా కూర్చొని చేతులు నులుముకుంటూ పశ్చాతాపం పడే సమయంలోను ఆమెకు ఆమె సాటి. కుడిచేయి నడుము మీద పెట్టుకొని ఎడమ చేయి ఆడిస్తూ చెంగు దోపుకొని ఆమె చెప్పే డైలాగ్ లకు ప్రేక్షకులు పడి పడి నవ్వుకుంటారు. ఆమె నటనకి హాస్యరస శిరోమని అన్న బిరుదుని కూడా సొంతం చేసుకోండి. ఇకపోతే దర్శకులు అయితే సన్నివేశం చెప్పి అమ్మ మీకు చెప్పేదేముంది కాస్త మసాలా వేసి సన్నివేశాన్ని పండించమనేసేవారు.
ఇక తాను ఓకే టేక్ లో చేయించుకునే అరుదైన నటుల్లో ఆమె ఒకరు. ఇదిలా ఉంటే ఆమె నెల్లూరు నుంచి మద్రాసు వస్తుండగా తన కారు ఒకసారిగా ట్రబుల్ ఇచ్చి ఆగిపోయింది. ఇక ఆ దారిన పోతున్న ఒక ఆమె తనను చూసి గుర్తుపట్టి నువ్వు సూర్యకాంతనివి కదా అంటూ.... ఎన్ని పెళ్లి కాపురాలు కులుస్తవమ్మ. నీకేం పోయేకాలం కోడలిని అలా రాచిరంపాన పెడుతున్నావని తిట్టేసింది. ఇదిలా ఉంటే 700 కి పైగా సినిమాలు నటించి భారీ విజయాన్ని అందుకున్న గొప్ప నటి సూర్యకాంతం. సుఖాలు పంచుకోవాలని తమ కష్టాలు చెప్పి బాధ పెట్టకూడదని నమ్మే తను. మధుమోహ వ్యాధిని దాచిపెట్టి 70 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆమె చనిపోయి దాదాపు 30 ఏళ్ళు అయితున్న కానీ నేటికీ ఆమె కోసమే పాత సినిమాలు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు.