మెగాస్టార్ చిరంజీవి కొన్ని సంవత్సరాల క్రితం హిట్లర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు కొన్ని ఆసక్తికరమైన అంశాలు జరిగాయట అవి ఏమిటో తెలుసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి వరసగా నటించిన సినిమాలు ఫ్లాప్ కావడంతో కచ్చితంగా ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలి అని అనేక కథలను వింటూ వస్తున్నాడట. ఆ సమయంలో ఎడిటర్ మోహన్ గారు అప్పుడే విడుదల అయిన మలయాళ హిట్లర్ మూవీని చూసి అది మీపై చాలా బాగా వర్క్ అవుట్ అవుతుంది అని చెప్పాడట.

దానితో కథ కొత్తగా ఉండటం వల్ల రిస్క్ అయిన పర్లేదు ఆ సినిమాను రీమిక్ చేయాలి అని చిరంజీవి డిసైడ్ అయ్యాడట. దానితో తెలుగు నేటివిటీకి తగ్గట్లు , చిరంజీవి ఈమేజ్ కి తగ్గట్టు ఆ సినిమాలోని కథలో మార్పులను ఎడిటర్ మోహన్ గారు తన సిబ్బందితో కలిసి చేశారట. ఇక కథ మొత్తం పూర్తి అయ్యాక ఎడిటర్ మోహన్ గారి ఆఫీసులో అటెండర్ గా పని చేస్తున్న ఒక అబ్బాయి ఈ సినిమా కథను విన్నాడట. ఆయన ఆ వెంటనే ఎడిటర్ మోహన్ గారి దగ్గరికి వచ్చి ఈ సినిమా తెలుగులో ఆడదు ... ఫ్లాప్ అవుతుంది అన్నాడట. దానితో మోహన్ గారు ఎందుకు ఈ సినిమా ఆడదు అంటున్నావ్ ... అన్నాడట. దానితో హీరో క్యారెక్టర్ చాలా గొప్పది అంటున్నారు.

మరి హీరో చెల్లెలు ప్రేమిస్తేనేమో వద్దు అంటున్నాడు. దానిని జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అన్నాడట. దానితో వారు కూడా పాయింట్ మంచిది అని చెప్పి ఆ తర్వాత కథలో మళ్లీ మార్పులు చేసి ఒక చెల్లెకు ప్రేమ వివాహం ద్వారా కష్టాలు ఎదురయ్యాయి. అందుకే హీరో ఇంకొ చెల్లికి ప్రేమ వివాహం వద్దంటున్నాడు అనే మార్పులను చేశారట. ఇలా ఒక అటెండర్ వల్ల ఈ సినిమా కథను మళ్ళీ చాలా వరకు మార్చినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: