తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడుగా ఎన్టీఆర్ స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన ఒక్కో పాత్ర ఓ గొప్ప చరిత్ర ! అలాగే మెగా ఫోన్ పెట్టి మెరుపులు కూడా మెరిపించారు దర్శకుడుగా ఆయన పాటించిన ప్రయాణాలు, సాధించిన విజయాలు.. ఎవరికైనా అనితర సాధ్యం. ఎన్టీఆర్ దర్శకత్వ పటిమ‌ గురించి చెప్పడానికి దానవీరశూరకర్ణ ఒకటి చాలు .. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఏ సినిమాకి దక్కని గొప్ప ఖ్యాతి దానవీరశూరకర్ణ సొంతం చేసుకుంది. ఏకంగా మూడు పాత్రలో ఒకే హీరో పోషిస్తూ దర్శకత్వం వహించడం అందులను ఓ గొప్ప పౌరాణిక గాధ కావడం అది న భూతో న భవిష్యత్‌!


ఇక మేకప్ వేసుకోవడానికి మూడు గంటలు దాన్ని తొలగించడానికి మరో రెండు గంటలు.. అందులోనా ఒకేసారి మూడు పాత్రలు చేస్తూ దర్శకత్వం వహించాలి. అంటే నాలుగు పడవల ప్రయాణం అన్నమాట. అయితే ఈ సర్కస్ ఫీట్ను ఎంతో అవలీలగా పూర్తి చేసిన ఘటికుడు నటరత్న ఎన్టీఆర్. ఇక నిజానికి మూడు పాత్రలు తను ఒక్కడే పోషించాలని ఆలోచన ఎన్టీఆర్‌కు ఎప్పుడు రాలేదు. ముందుగా కృష్ణుడు పాత్ర అక్కినేని నాగేశ్వరరావు కి ఇవ్వాలని ఆయన అనుకున్నారు .. ఆయన ఆ పాత్రకు నో చెప్పారు.. అయితే కనీసం కర్ణుడు పాత్ర అయినా చేయమన్న ఆయన కాదన్నారు. కృష్ణుడిగా అప్పటివరకు ఎన్టీఆర్ ను చూసిన కళ్ళతో నన్ను చూడలేరే కర్ణుడిగా నేను చేస్తే పాండవులు కూడా మరుగుజ్జులుగా కనిపిస్తారని అక్కినేని అనుకున్నారు. అందుకే చివరికి ఆ మూడు పాత్రుల భారం ఎన్టీఆర్ మీదే పడాల్సివచ్చింది.


అలానే ఈ సినిమాలో దుర్యోధనుడు పాత్రకు డ్యూయెట్ పెట్టి మెప్పించిన ఘనత కూడా ఎన్టీఆర్ కే దక్కింది. చిత్రం.. విచిత్రం పాట అప్పట్లో గొప్ప సంచలనం. ఆ పాట వింటే అచ్చం ఎన్టీఆర్ పాడుతున్నట్టే ఉంటుంది . దుర్యోధనుడి బాడీ లాంగ్వేజ్ ని అర్థం చేసుకుని బాలసుబ్రహ్మణ్యం ఆ పాటని పాడారు. ఈ పాట రికార్డింగ్ సమయంలో కూడా ఆయన పక్కనే ఉండి ఎన్టీఆర్ బాలుకి సలహాలు కూడా ఇచ్చారట. అందుకే ఈ పాట అంత అద్భుతంగా వచ్చిందని అంటారు. అలాగే కర్ణుడు పాత్ర పై ఇంత సానుభూతి చూపించిన చిత్రం కూడా ఇదే ?  ఆ క్యారెక్టర్ ని ఎన్టీఆర్ అర్థం చేసుకున్న తీరు దాన్ని వెండి ధరపై చూపించిన విధానం ఈనాటికి కొత్తగా వచ్చే దర్శకులకు ఓ పాఠాయ‌ పుస్తకం. ఇక డైలాగులన్నీ డైనమైట్లే. ‘ఏమంటివీ.. ఏమంటివీ..’ అంటూ సాగే సుదీర్ఘమైన సంభాషణ ఇప్పటికీ ఏదో రూపంలో, ఏదో వేదికపై వినిపిస్తూనే ఉంటుంది. డైలాగుల కోసమే ఆడియో రికార్డులు కొనే ట్రెండ్‌ ఈ సినిమాతో మరింత పాపులర్‌ అయ్యింది.


అలాగే ఈ సినిమాలో ముఖ్యంగా ప్రేక్షకులు అకట్టుకున్న క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది దుర్యోధనుడు పాత్ర అనే చెప్పాలి. ఎన్టీఆర్ ఈ సినిమాలో దుర్యోధనుడు , కృష్ణుడు , కర్ణుడు పాత్రలో నటించిన.. నెగిటివ్ పాత్ర అయినా దుర్యోధనుడు పాత్రేప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలు కన్నా ముందు ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన భూకైలాస్ లో రావణాసురుడు పాత్ర కూడా నెగిటివ్ పాత్ర అయినా కూడా ఎన్టీఆర్ తన నటనతో హీరో పాత్రగా మలిచాడు. ఇలా ఎన్టీఆర్ చేసిన నెగిటివ్ పాత్రలు అన్నీ కూడా ఇప్పటికీ హీరోల పాత్ర కన్నా ఎంతో వైవిధ్యంగా ఉంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. అందుకే విలన్ అయినా హీరో అయినా అది ఒక ఎన్టీఆర్ కే సాధ్యం .

మరింత సమాచారం తెలుసుకోండి: