కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు మనోజ్ హీరోగా మంచి పేరే తెచ్చుకున్నారు.ఇదిలా ఉంటే మనోజ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో నేను మీకు తెలుసా సినిమా ఒకటి. ఈ సినిమా మనోజ్ కు మంచి విజయాన్ని అందించింది. సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో మనోజ్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.ఈ సినిమాలో మనోజ్ కు జోడీగా స్నేహ ఉల్లాల్, రియా సేన్ నటించారు. ఇంట్రెస్టింగ్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని మనోజ్ సోదరి లక్ష్మి మంచు నిర్మించింది. ఈ చిత్రాన్ని తమిళంలో ఎన్నై థెరియుమా … ? విడుదల చేశారు. ఈ సినిమాకు అజయ్ శాస్త్రి దర్శకత్వం వహించారు. అలాగే ఈ మూవీలో  పాటలను అచ్చు, ధరణ్ స్వరపరిచారు. నేపథ్య స్కోర్‌లను సంతోష్ నారాయణన్, శక్తి అందించారు.ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. 

అలాగే ఈ మూవీలో ఓ ఓల్డ్ సాంగ్ ను రీమేక్ చేశారు. మబ్బే మసకేసింది అనే సాంగ్ ను రీమిక్స్ చేశారు. అయితే ఈ సాంగ్ లో మనోజ్ తో స్టెప్పులేసి బ్యూటీ గుర్తుందా.? మాస్ స్టెప్పులతో పాటు అందాలతోనూ ఆకట్టుకుంది ఆ భామ. ఆమె పేరు కౌశ రాచ్. ఈ అమ్మడిని చాలా మంది గుర్తుపడతారు కానీ ఆమె పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ చాలా సినిమాల్లో నటించింది ఆమె.ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో హాట్గా తయారయ్యింది బ్యూటీ.లో దుస్తులు కనిపించేలా డ్రెస్సింగ్ తో ఫోటోకు ఫోజులు ఇస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.ఇదిలావుండగా మనోజ్ ప్రస్తుతం కమ్ బ్యాక్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాడు. బుల్లితెరపై ఉస్తాద్ షోతో రచ్చ చేశాడు. ఇక మిరాయ్ మూవీతో విలన్‌గానూ కొత్త రూపాన్ని చూపించబోతోన్నాడు. వాట్ ది ఫిష్ ఫినిషింగ్ దశలో ఉన్నట్టుగా సమాచారం. పర్సనల్ లైఫ్ కూడా హాయిగా సాగుతోంది. ఇప్పుడు మనోజ్ రెండు రకాలుగా సంతోషంగా ఉన్నాడు. ఫ్యామిలీ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ జాలీగా సాగుతోంది.మంచు వారింట్లో ఉన్న విబేధాలు అయితే ఎక్కువగా చర్చల్లోకి వస్తున్నాయి. మనోజ్, విష్ణు మధ్య ఇంకా దూరం తగ్గలేదని తెలుస్తోంది. మంచు లక్ష్మీ, మనోజ్ ఒక జట్టుగా ఉన్నారని, విష్ణు ఒక వైపు ఉన్నారని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: