టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అనగానే అందరికీ మొదటగా గుర్తొచ్చే పేరు చిరంజీవి.  మెగాస్టార్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు.  చిరంజీవి ఒరిజినల్ నేమ్ చిరంజీవి కాదు అన్న విషయం అందరికీ తెలుసు. " శివ శంకర వరప్రసాద్ ". అయితే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక చిరంజీవిగా తన పేరు మార్చుకున్నాడు . ఆంజనేయ స్వామీ ఆశీస్సులతో మెగాస్టార్ గా ఎదిగి తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే వన్ ఆఫ్ ద స్టార్ హీరోగా కొనసాగడమే కాకుండా ఇప్పటికీ ఇండస్ట్రిని ఏలేసే అంత కెపాసిటీ దక్కించుకున్నాడు.


చిరంజీవి అంటే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అని  అంతా అనుకుంటూ ఉంటారు.  అయితే అలాంటి చిరంజీవిని తన తల్లి అంజనమ్మ ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా? ఖచ్చితంగా అది తెలుసుకున్న ప్రతి ఒక్కరు షాక్ అవుతారు . చాలామంది డబ్బు ఉన్న పిల్లలు.. డబ్బున్న వారు పెట్ నేమ్‌స్ తో పిలుచుకుంటూ ఉంటారు . పూర్తి పేరు పెట్టి ఎవరు పిలవరు . అయితే అంజనమ్మ మాత్రం చిరంజీవిని మొదట శివ శంకర వరప్రసాద్ అని.. అదేవిధంగా చిరంజీవి ఇండస్ట్రీ లోకి వచ్చాక చిరంజీవి అంటూ పిలుస్తుందట .



ఇప్పటికి కూడా ఆమె పూర్తిగా చిరంజీవి అంటూనే పిలుస్తుందట . నాన్నలు ..బుజ్జులు.. కన్నులు అంటూ పెట్ నేమ్‌స్ తో పిలవదట . తల్లిదండ్రులు జన్మ నక్షత్ర ప్రకారం పెట్టిన పేరును ఆ తల్లిదండ్రులు పిలిస్తే ఆ బిడ్డకి బాగా కలిసి వస్తుంది. ఈ విషయాన్ని మర్చిపోయిన జనాలు ఇప్పుడు నాన్నలు ..బుజ్జులు అంటూ ముద్దు పేరుతో పిలుస్తున్నారు . పెట్టిన పేరుని మర్చిపోతున్నారు . కానీ అంజనమ్మ మాత్రం చిరంజీవా అంటూ పిలుస్తుందట. అందుకే మెగా స్టార్ చిరంజీవిగా ఎదిగాడు చిరంజీవి అంటూ మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . అంజనమ్మ అంత ప్రేమగా పిలవడంతోనే ఆమెకు చిరంజీవి అంటే ఎంత ప్రేమ అర్థం చేసుకోవచ్చు అంటున్నారు ఫాన్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి: