ప్రధానంగా హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి రానా , తేజ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇదెక్కడి దిక్కుమాలిన సెంటిమెంట్ రా బాబు అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇక తేజ సజ్జా మాట్లాడుతూ వరలక్ష్మి గారికి ఏదైనా సినిమాలో అవకాశం ఇస్తే మాత్రం ఆమె తన పాత్ర కోసం ప్రాణం పట్టి నటిస్తారని అన్నాడు.. దానికి రానా రియార్ట్ అవుతూ అవునులే ఈవిడ ప్రాణం పెడతారు డైరెక్టర్లు ఈవిడ ప్రాణం తీస్తారు అని సెటైర్ కూడా వేశాడు. ఇక వెంటనే దానికి తేజ ఏ ఏ సినిమాల్లో చనిపోయారో చెబుతూ.. హనుమాన్ సినిమాల్లో చనిపోయింది, వీర సింహారెడ్డిలో చనిపోయింది ,క్రాక్ లో చనిపోయారు. యశోదలో కూడా చనిపోయారంటూ తేజ నవ్వులు పూయించాడు..
ఇక దానికి వరలక్ష్మి రియాక్ట్ అవుతూ.. నేను బ్రతికున్న సినిమాలు కూడా చాలా ఉన్నాయి అంటూ వారిని బతిమాలుకుంది.. దానికి రానా రియాట్ అవుతు మిమ్మల్ని బ్రతికిస్తే ఆ సినిమాలు చచ్చిపోయి అంట అంటూ రానా ఫన్నీ కామెంట్ చేశాడు. అక్కడ వారంతో ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఏదైనా సినిమా హిట్ అవ్వాలంటే వరలక్ష్మీ పాత్రని చంపేయాలి ఇది కొత్త సెంటిమెంట్ అని అర్థం వచ్చేలా తేజ - రానా కామెంట్ చేయడం విశేషం. ఇక మరి రాబోయే రోజుల్లో కూడా సినిమాల్లో ఈ సెంటిమెంట్ తో వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రను చనిపోయేలాగా రాస్తారేమో పాపం .