పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు బోయపాటి.. అఖండకు హిందీ ఓటీటీలో కూడా భారీ రెస్పాన్స్ రావడంతో బాలయ్య పాత్రకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారుతున్నది. ఇందులో బాలయ్య దేవాలయాల పవిత్రతను కాపాడి ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారట.. హిందూ దేవాలయాలు గ్రంథాల జోలికి ఎవరు వచ్చిన సరే వారిని తాట తీసే రోల్లో కనిపించబోతున్నారట. ఈ పాత్రలో రౌద్రం మామూలుగా ఉండదని.. ఆయన కళ్ళల్లో కోపాన్ని చూస్తే శత్రువులు కూడా భయపడేలా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
సనాతన ధర్మాన్ని కూడా ఇందులో టచ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట. ఈ పాయింట్ తోనే బోయపాటి ఒక పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నారట.. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హిందుత్వం ఎలా ఉన్నది బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందుత్వం ఎలా ఉన్నది అనే పాయింట్ ని టచ్ చేయబోతున్నట్లు సమాచారం. అఖండ చిత్రంలో బాలయ్య అఘోర పాత్రలో కనిపించారు ఇప్పుడు అంతకుమించి మరి అఘోర 2.O పాత్ర ఉంటుందనే విధంగా అభిమానులు అంచనాలైతే ఉన్నాయి. మరి అభిమానుల అంచనాలను నిరాశ చేయకుండా చూస్తారేమో బోయపాటి చూడాలి.