స్వర్గీయ నందమూరి తారకరామారావు మనవడిగా తెలుగు ఇండస్ట్రీ లోకి వచ్చిన ఎన్టీఆర్.. బాలనటుడుగా రామాయణం సినిమాలో బాలరాముడిగా ఎంతగానో అలరించాడు.. శ్రీరాముడు చిన్నతనంలో ఇంత అందంగా ఉండేవాడా అని ఆ పాత్రలో ఎన్టీఆర్ ని చూసి అందరూ మెచ్చుకున్నారు.. ఎన్టీఆర్ ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోయిన హీరోగా ఎన్టీఆర్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు..స్టూడెంట్ నెం1 సినిమాతో మొదటి సూపర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్‌ ఆది, సింహాద్రి సినిమాతో తిరుగులేని మాస్‌ హీరోగా ఎదిగాడు ఇక ఆ తరువాత జూనియర్‌ ఎన్టీఆర్‌ నట ప్రస్థానం అద్భుతంగా సాగింది..ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో పాన్‌ ఇండియా హీరోగా ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ‘దేవర’ చిత్రంతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ దేవర, వరగా ద్విపాత్రాభినయంలో అద్భుతంగా నటించి మెప్పించాడు. నేటి తరం స్టార్ హీరోలలో ఎన్టీఆర్‌ లా ఆల్ రౌండర్ గా మెప్పించే వారు లేరు.. అయితే తాను నటనలో, డ్యాన్సుల్లో ఓ ప్రత్యేకత సంపాందించుకోవడానికి కారణం తన అమ్మే అని ఎన్టీఆర్‌ తెలిపాడు... 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన అమ్మ గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశారు.. ఈ జీవితంలో నీ కంటూ ఏదైనా ప్రత్యేకత ఉన్నప్పుడే ఈ సమాజం నిన్ను గుర్తిస్తుంది..నీదంటూ ఓ మార్క్‌ క్రియేట్‌ చేసుకుంటేనే నలుగురిలో నీకు మంచి గుర్తింపు వస్తుందని ఆమె చెబుతుండేది. ఆమె మాటల నాకు ఎంతో ఇన్‌స్పిరేషన్‌ గా అనిపించేవి.. అందుకే కూచిపూడి నేర్చుకున్నాను. అమ్మ నుంచే అందరితో మాట్లాడటం తెలుసుకున్నానని ఎన్టీఆర్ తెలిపారు..చాలా మంది అమ్మలు తమ పిల్లల్ని ఒంటరిగా ఏ తోడు లేకుండా బయటికి పంపించడానికి ఒప్పుకోరు.కానీ మా అమ్మ మాత్రం ఎక్కడికైనా ఒంటరిగా వెళ్లు అని చెప్పేది. జీవితంలో ఏ విషయమైనా కూడా స్వతహాగా తెలుసుకోమనేది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మ ఎప్పుడూ నా దగ్గర తన కష్టాల్ని దాచిపెట్టలేదు. కష్టాలను దాటుకొని ఎదగడమే గొప్పగా ఉంటుందని నాకు చెబుతుండేది. కష్టపడ్డ వారు మాత్రమే కష్టానికి తగ్గ ప్రతిఫలం అనుభవించాలని చెప్పేది..అందుకే నాకు హీరోగా ఇంత పేరొచ్చినా కూడా అమ్మ అసలు బయటికి రాదు. కష్టం నాదే కాబట్టి ప్రతిఫలం కూడా నాకే దక్కాలని అమ్మ చెప్పేదని తారక్ తెలిపారు…

మరింత సమాచారం తెలుసుకోండి: