మరో తెలుగు సినిమాకి సైన్ చేసిన అనుష్క.. హీరో ఎవరో తెలిస్తే ఎగిరి గంత్తేస్తారు..!?

Thota Jaya Madhuri
అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  సినిమా ఇండస్ట్రీ లోకి సూపర్ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన కెరీర్ ని సూపర్ డూపర్ హిట్ గా మార్చేసుకుంది. అయితే కొంతమంది హీరోయిన్స్ హిట్ పడ్డాక కేవలం స్టార్ హీరో సినిమాలలో మాత్రమే నటిస్తూ ఉంటారు . చిన్నా చితక హీరోల సినిమాలలో నటించరు . ఆ విషయాలు మనకు బాగా తెలుసు.  క్రేజీ పాపులారిటీ పబ్లిసిటీ సంపాదించుకున్నాక ఎక్కడ చిన్న హీరో సినిమాలో నటిస్తే తమ క్రేజ్ పడిపోతుందో అన్న భయంతో చాలామంది ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ అలా నటించడానికి ఇంట్రెస్ట్ చూపించరు. అయితే అనుష్క మాత్రం వాళ్ళందరికీ వ్యతిరేకం . న్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు అందుకున్నా అనుష్క చిన్న చిన్న హీరో సినిమాల్లో కూడా చేసింది .


మరి ముఖ్యంగా నవీన్ పోలిశెట్టి లాంటి హీరోతో "మిస్ శెట్టి మిస్టర్ పోలీస్ శెట్టి" అనే సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది . ప్రజెంట్ క్రిష్ దర్శకత్వంలో "ఘాటి" సినిమాలో నటిస్తుంది. అయితే ఆ తర్వాత ఏ తెలుగు సినిమాకి అనుష్క సైన్ చేయకపోవడం తెలుగు అభిమానులను బాగా బాధపెట్టింది . ఫైనల్లీ తెలుగు అభిమానులను ఖుషి చేస్తూ  ఓ వార్తను అందించబోతుంది అనుష్క అంటూ ఓ న్యూస్ తెలుగు లో బాగా హల్చల్ చేస్తుంది.


అనుష్క ఎంతమందితో జత కట్టిన .. తెరపై అనుష్క ఈ హీరో తో నటిస్తే  బాగుంటుంది అనుకునే హీరో మాత్రం ప్రభాస్.. ఆ తర్వాత ఆ లిస్టులో ఉండేది కచ్చితంగా నాగార్జుననే.. వీళ్లిద్దరికి చాలా ఏజ్ గ్యాప్ అయినా సరే వీళ్ళిద్దరి పర్ఫామెన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది.  సినిమాలో కూడా మంచి హిట్ అందుకున్నాయి . అయితే నాగార్జున తన వందవ సినిమాలో కీలక పాత్ర కోసం అనుష్క ని చూస్ చేసుకున్నారట .


లైఫ్ ఇచ్చిన హీరో సినిమా కోసం అనుష్క క్యారెక్టర్ నచ్చకపోయినా కూడా ఓకే చేసిందట . దీంతో సోషల్ మీడియాలో అనుష్క కి సంబంధించిన ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు నాగార్జున 100వ సినిమాలో హీరోయిన్గా త్రిషని చూస్ చేసుకున్నారట . అయితే ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం కథను మలుపు తిప్పే పాత్ర కోసం అనుష్కను చూస్ చేసుకున్నాడట నాగార్జున . త్వరలోనే ఆయన ఈ  సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారట.  ఎవరు ఊహించని విధంగా నాగర్జున సినిమాలో  అనుష్క కనిపించబోతుంది అన్న వార్త తెరపై రావడంతో అనుష్క పేరు తెలుగు సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: