బాక్సాఫీస్ కు ఉచ్చ కోత మొదలు .. పుష్ప2 1000 కోట్లు ఎలా సాధ్యమంటే..?
అయితే ఇప్పుడు పుష్ప2 1000 కోట్లు సాధిస్తుందా లేదా .. అనేదానిపై రకరకాల కామెంట్లు విశ్లేషణలు వస్తున్నాయి. గ్రాఫిక్స్ ఫాంటసీ లేని ఒక మాస్ కమర్షియల్ సినిమా ఆ మైలురాయి అందుకోవటం అంత సులభం కాదని .. అయితే పుష్ప 2 మానియా చూస్తుంటే అది సాధ్యం కాదని చేప్పలేని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే నార్త్ ప్రేక్షకులను సుకుమార్ మెప్పిస్తే బాలీవుడ్ నుంచి ఎంత లేదన్న అక్కడి నుంచే 400 కోట్లకు పైగా కలెక్షన్లు వస్తాయి. మన తెలుగు రాష్ట్రాలు సౌత్ రాష్ట్రాలు ఓవర్సీస్ కలిపి ఆరు ఏడు వందల కోట్లు గ్రాస్ సులభంగా వచ్చేస్తుంది. మొత్తంగా 1000 కోట్లు లెక్క ఇక్కడే వచ్చేసింది.
ఒకవేళ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే మాత్రం కలెక్షన్ల సునామి ఎవరు ఊహించని రేంజ్ లో ఉంటుంది. ఎందుకంటే అటు బాలీవుడ్ , టాలీవుడ్ లోనే కొన్ని నెలలుగా ఉరా మాస్ సినిమా రాలేదు. దేవర ఒక్కటే మంచి విజయం సాధించినా కానీ 1000 కోట్లు సాధ్యం కాలేదు. 500 కోట్లు దాకా వచ్చి ఆగిపోయింది. అయితే ఇప్పుడు పుష్ప 2 కేసు మరోలా ఉంది బాగుందని మాట వస్తే చాలు కలెక్షన సునామి మామూలుగా ఉండదు. టికెట్ రేట్ల పెంపు అడ్వాంటేజ్ అదనం. జనవరి 20 కొత్త రిలీజులు వచ్చేదాకా పదిహేను రోజుల సమయం దొరుకుంటుంది. బాహుబలి, రాజమౌళి, కెజిఎఫ్ రికార్డులను గురిపెట్టుకున్న పుష్ప 2 అన్నంత పని చేస్తే మాత్రం సరికొత్త చరిత్ర లిఖితమవుతుంది.