ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే వరంగల్ జిల్లాలోని ఒక మారుమూల తాండాలో నివసించే కేశవ చంద్ర రమావత్ చిన్న వయసు నుంచే కెసిఆర్ అంటే చాలా అభిమానం ఇష్టం ఉండడంతో ఆ ఊరి వాళ్లంతా కూడా ఇతనని చోటా కెసిఆర్ అని పిలుస్తూ ఉండేవారట. అలాగే అదే ఊర్లో తన మరదలు మంజు (అనన్య కృష్ణన్) కెసిఆర్ ని ఇష్టపడుతుంది. అలా పెళ్లి వయసు వచ్చిన తర్వాత తనని పెళ్లి చేసుకోమని మంజు అడగగా.. చంద్ర రామావత్ తాను చేసుకోలేనని తెలియజేస్తారు.
అయితే అదే ఊరిలో డబ్బున్న మరొక అమ్మాయిని సైతం చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటారు. అలా తన పెళ్లికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని తీసుకువస్తానంటూ ఆ ఊరి జనాలకు సైతం లేనిపోని మాటలు చెప్పి హైదరాబాద్ కి వస్తారు ఆ తర్వాత ఏం జరిగింది అనే కథాంశమే ఈ సినిమా కథ.
ఇందులో చంద్ర రమావత్ పాత్రలో (రాకింగ్ రాకేష్)బాగానే నటించారని.. అలాగే మరదలు పాత్రలో కూడా అనన్య కృష్ణన్ బాగా నటించిందని నెటిజన్స్ తెలుపుతున్నారు. ఇందులో కొన్ని సన్నివేశాలు తెలంగాణ కాలం నాటి రోజులను గుర్తు చేస్తున్నాయని.. జోర్దార్ సుజాత, తాగుబోతు రమేష్ వంటి పాత్రలు కూడా ఇందులో కొంతమేరకే ఉన్నాయట. డైరెక్టర్ గరుడవేగ అంజి ఈ సినిమా దర్శకత్వం వహించారు.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఇలాంటి సినిమాలు ఆడడం కష్టమే అన్నట్లుగా పలువురు నెటిజెన్స్ తెలియజేస్తున్నారు. ఈ సినిమాకి కెసిఆర్ పేరు హైలెట్ తప్ప మరి ఏమీ లేదనే విధంగా తెలియజేస్తున్నారు నెటిజెన్స్.. కెసిఆర్ అభిమానులకు అయితే నచ్చుతుందని.. తెలుపుతున్నారు..మొత్తానికి రాకింగ్ రాకేష్ నిర్మాతగా సక్సెస్ అయ్యారో లేదో తెలియాలి అంటే కలెక్షన్స్ రాబట్టి రాకేష్ లాభాల బాట పడితేనే సక్సెస్ లేకపోతే ఫెయిల్యూర్ గానే ఈ సినిమా మిగిలిపోతుంది.