ఈ మధ్యకాలంలో తక్కువ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు అతిపెద్ద హిట్టు కొడుతున్నాయి. అలాంటి సినిమాలలో ముందుగా చెప్పుకోవాల్సింది బలగం, బేబీ వంటి సినిమాలు ఉన్నప్పటికీ ఈ సినిమా కంటే ముందే పెళ్లి చూపులు సినిమా 2016 లోనే చిన్న సినిమాగా తక్కువ బడ్జెట్ తో వచ్చి అతిపెద్ద హిట్టు కొట్టింది.. పెళ్లిచూపులు సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 పెళ్లిచూపులు మూవీ అవార్డ్స్:

 తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో యష్ రంగినేని,రాజ్ కందుకూరిలు నిర్మాతలుగా చేసిన పెళ్లిచూపులు సినిమాలో విజయ్ దేవరకొండ రీతూ వర్మలు హీరో హీరోయిన్లుగా చేశారు. 2016 జూలై29న విడుదలైన పెళ్లి చూపులు మూవీ ప్రేక్షకులకు ఇట్టే కనెక్ట్ అయిపోయింది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని హీరోయిన్ రీతూ వర్మ సొంతంగా బిజినెస్ చేయాలనే ఆశతో ఉంటుంది. ఇక హీరో విజయ్ దేవరకొండ అతి కష్టం మీద చదివి పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు.అలా సడన్ గా పెళ్లి చూపులకు వెళ్లి ఒక అమ్మాయిని చూడడానికి వెళ్లి మరో అమ్మాయిని చూస్తాడు. ఆ సమయంలో హీరో హీరోయిన్ ఇద్దరు ఒక రూమ్ లో ఇరుక్కుపోతారు.ఆ తర్వాత కథ స్టార్ట్ అవుతుంది. ఇక పెళ్లి ఇష్టం లేని హీరోయిన్ ఫుడ్ ట్రక్ బిజినెస్ చేయాలి అనుకుంటుంది. ఆమెకి తోడు ఆవారాగా తిరిగే విజయ్ దేవరకొండ హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ఆయనకు వంట చేయడం అంటే చాలా ఇష్టం.


అలా వీరిద్దరూ కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తారు.అలా వీరి ఫుడ్ ట్రక్ బిజినెస్ సక్సెస్ అయ్యి ఆ క్రమంలోనే ప్రేమలో పడతారు. అయితే తక్కువ బడ్జెట్ తో వచ్చిన పెళ్లిచూపులు సినిమా స్టోరీని మాత్రమే నమ్ముకొని ప్రేక్షకుల్లోకి వచ్చారు డైరెక్టర్ తరుణ్ భాస్కర్.అయితే ఈ స్టోరీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవ్వడంతో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది..ఇప్పటి రోజుల్లో ఒక సినిమా వంద రోజులు ఆడాలంటే చాలా కష్టం. కానీ పెళ్లిచూపులు సినిమా హైదరాబాద్ వంటి మెయిన్ సిటీలో 100 రోజులు ఆడింది. అంతేకాదు యూఎస్ లో కూడా ఈ సినిమా భారీ హిట్ కొట్టింది. తక్కువ ఖర్చు పెట్టి ఈ సినిమాని కొనుగోలు చేసిన యుఎస్ డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట తెచ్చిపెట్టింది. ఇక కలెక్షన్ల పరంగానే కాదు  64వ ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా పెళ్లిచూపులు సినిమాకి అవార్డు రావడం అనేది మామూలు విషయం కాదు.ఈ సినిమాకి అవార్డు రావడం 80 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఓ మైలురాయి అని చెప్పుకోవచ్చు.ఈ సినిమాకి మాత్రమే కాదు ఉత్తమ సంభాషణల కేటగిరీలో  పెళ్లిచూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కి అవార్డు రావడం కూడా జరిగింది. అలా రెండు జాతీయ అవార్డులతో పెళ్లి చూపులు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించింది

మరింత సమాచారం తెలుసుకోండి: