పది కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన బేబీ మూవీ 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి అద్భుత సినిమాగా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది.అయితే అలాంటి ఈ సినిమా కేవలం వసూళ్ల పరంగానే కాదు అవార్డుల పరంగా కూడా..అయితే అలాంటి బేబీ మూవీ కి వచ్చిన అవార్డ్స్ ఎన్ని ఏ కేటగిరీలో వచ్చాయి అనేది ఇప్పుడు చూద్దాం..

 బేబీ మూవీ అవార్డ్స్:
ఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్య, వీరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో చేసిన బేబీ మూవీ కి సాయి రాజేష్ దర్శకత్వం వహించగా.. ఎస్ కే ఎన్ నిర్మాతగా చేశారు. అయితే ఈ సినిమా విడుదల కాకముందే వచ్చిన పోస్టర్, గ్లింప్స్, సాంగ్స్ ఇలా ప్రతి ఒక్కటి అభిమానులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సినిమా విడుదల తర్వాత సినిమా చూసిన ఎంతోమంది లవ్ ఫెయిల్యూర్స్ కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేరు.ఈ సినిమాలో హీరోయిన్ చేసిన మోసం, హీరో మోసపోవడం, విరాజ్ అశ్విన్ లాంటి క్యారెక్టర్ ఎంట్రీ ఇవ్వడం, అమ్మాయికి అమ్మాయే శత్రువు అన్నట్టు కిర్రాక్ సీత పద్ధతి గల వైష్ణవి చైతన్యను మార్చేయడం.ఇలా ప్రతి ఒక్కటి ఇప్పటి జనరేషన్ కి తగ్గట్టు డైరెక్టర్ సాయి రాజేష్ కళ్ళకు కట్టినట్టు చూపించారు.ఈ సినిమా చివర్లో హీరోయిన్ వైష్ణవి చైతన్యని పిచ్చిగా ప్రేమించిన ఆనంద్ దేవరకొండ ఎమోషనల్ డైలాగ్స్, వీరాజ్ కోపం ఇలా అన్నీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. 


ముఖ్యంగా సినిమా క్లైమాక్స్లో హీరోయిన్ వైష్ణవి చైతన్య ఆనంద్ దేవరకొండ దగ్గరికి వచ్చిన సమయంలో ఆయన చెప్పిన మాటలు ఎంతోమంది లవ్ బ్రేకప్ అయిన వారిని కన్నీళ్లు పెట్టించాయి. ముఖ్యంగా అటు విరాజ్ అశ్విన్ ని ఇటు ఆనంద్ దేవరకొండ ఇద్దరినీ కాకుండా మరో అబ్బాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా కనిపించే వైష్ణవి చైతన్యని చూసి జుట్టు, గడ్డం పెంచుకొని పిచ్చివాడైన ఆనంద్ దేవరకొండ ఆమెను చూసే సీన్ ఎంతోమందిని కన్నీళ్లు పెట్టించింది. ఇక ఈ సినిమా చూసి లవ్ ఫెయిల్యూర్ అయిన ఎంతోమంది అబ్బాయిలు కన్నీళ్లు పెట్టుకున్నారు. అలా యూత్ ని ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా కేవలం 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 100 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. అలా బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ సినిమా కేవలం వసూళ్లపరంగానే కాకుండా అవార్డుల పరంగా కూడా సినిమాకి మంచి గుర్తింపుని తెచ్చి పెట్టింది.

ఈ సినిమాకి దాదాపు 5 ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి.69వ సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ లో ఈ సినిమా సత్తా చాటింది.ఏకంగా 5 ఫిలింఫేర్ అవార్డ్స్  వచ్చాయి. బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ గా వైష్ణవి చైతన్యకు ఫిలింఫేర్ అవార్డు వచ్చింది.అలాగే బెస్ట్ సినిమా క్రిటిక్స్ గా కూడా ఈ సినిమాకి అవార్డు వచ్చింది.బెస్ట్ లిరిసిస్ట్ గా అనంత శ్రీరామ్ కి,బెస్ట్ మెయిల్ సింగర్ గా సింగర్ శ్రీరామచంద్రకి,బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా విజయ్ బుల్గానిన్ కి అవార్డులు వచ్చాయి. ఇలా అద్భుతమైన ప్రేమ కావ్యాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ సాయి రాజేష్ ని ఈ సినిమా చూశాక ఎంతోమంది మెచ్చుకోవడం గమనార్హం

మరింత సమాచారం తెలుసుకోండి: