టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన నయనతార చాలా సందర్భాల్లో వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు. నయనతార రెమ్యునరేషన్ విషయంలో టాప్ లో ఉన్న సంగతి తెలిసిందే. నయనతార ప్రాజెక్ట్ లు ఒకింత భారీ స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. నయనతర నటించిన అన్నపూరణి అనే సినిమా గతంలో ఒక వివాదంలో చిక్కుకుంది. ఆ సమయంలో నెట్ ఫ్లిక్స్ ఆ సినిమాను తొలగించింది.
 
తాజాగా నెట్ ఫ్లిక్స్ లో నయనతార డాక్యుమెంటరీ విడుదలైంది. సాధారణంగా నయన్ సినిమాలకు ఇచ్చే మొత్తంతో పోల్చి చూస్తే 20 శాతం ఎక్కువ మొత్తం ఇచ్చి నెట్ ఫ్లిక్స్ ఈ ప్రాజెక్ట్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుంచి ఆశించిన రేంజ్ లో రెస్పాన్స్ అయితే రాలేదు. అన్నపూరణి మూవీ వివాదం సమయంలో నెట్ ఫ్లిక్స్ లో కొంతమంది ఉద్యోగాలు సైతం పోయాయని సమాచారం అందుతోంది.
 
వినడానికి ఆశ్చర్యంగా, వింతగా అనిపించినా నయనతార, నెట్ ఫ్లిక్స్ కాంబినేషన్ కు మెజారిటీ సందర్బాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. నయనతార పారితోషికం కూడ ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే. నయనతార వివాదాలతో డాక్యుమెంటరీ సక్సెస్ చేయాలని చూసినా ఆ ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వడం లేదు. నయన్ కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి.
 
స్టార్ హీరోయిన్ నయనతార భిన్నమైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్నా ఈ మధ్య కాలంలో ఆమె సక్సెస్ రేట్ కూడా తగ్గిందనే సంగతి తెలిసిందే. నయనతార కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉన్నాయో చూడాల్సి ఉంది. నయనతార సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మాత్రం ఆమెకు తిరుగుండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. నయనతార ఇతర నటీమణులకు భిన్నంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. తెలుగులో నయనతార కెరీర్ పరంగా బిజీ కావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నయనతార మాత్రం తెలుగులో కొత్త సినిమాలకు ఎక్కువగా ప్రాధన్యత అయితే ఇవ్వడం లేదు.






మరింత సమాచారం తెలుసుకోండి: