శోభిత ధూళిపాళ్ళ.. ఒకప్పటివరకు ఈ పేరు చెప్తే జనాలు ఓకే ..ఆవిడ ఒక మంచి హీరోయిన్ ..బాగా నటిస్తుంది .. స్టార్ హీరోయిన్ అని చెప్పలేము కానీ కొన్ని కొన్ని పాత్రలు ఆమె కోసమే పుట్టినట్లు ఉంటాయి . అంత చక్కగా నటిస్తుంది.  మరీ ముఖ్యంగా  చాలా సినిమాలల్లో ఆమె పర్ఫామెన్స్ చూసి చాలామంది స్టార్స్ ఆమెకి కాల్ చేసి మరి "మీ యాక్టింగ్ బాగుంది.. మీకు ఇండస్ట్రీలో మంచి లైఫ్ ఉంటుంది" అంటూ అప్రిషియేట్ చేశారట.


అయితే అలాంటి శోభిత ధూళిపాళ్ళ త్వరలోనే ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ బడా ఫ్యామిలీ అయినా అక్కినేని ఇంటికి కోడలుగా రాబోతుంది . అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు అక్కినేని నాగచైతన్యతో ప్రేమాయణం కొనసాగించింది ఈ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల. ఫైనల్లీ ఇంట్లో వాళ్లకు చెప్పి నిశ్చితార్ధం  కూడా జరుపుకున్నారు.  డిసెంబర్ 4వ తేదీ వీళ్ళ పెళ్లి ఘనంగా ఘనంగా వైభవంగా అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగబోతుంది . రీసెంట్గా నాగార్జున ఈ విషయాన్ని అఫీషియల్ గా కన్ఫామ్ చేశాడు.



పెళ్లికి కేవలం 300  మంది గెస్ట్లు మాత్రమే వస్తున్నారు అని.. పెళ్లిని చాలా సింపుల్గా చేసుకోవాలి అంటూ నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల అనుకున్నారు అని చెప్పుకొచ్చారు.  ఇలాంటి మూమెంట్లోనే శోభిత ధూళిపాళ్ళ ఫేవరెట్ హీరో ఎవరు అనే విషయం బాగా ట్రెండ్ అవుతుంది. నాగచైతన్య తనకు కాబోయే భర్త కాబట్టి నాగచైతన్య తన ఫేవరెట్ హీరో అని చాలామంది అనుకుంటూ ఉంటారు . అలా అయితే మీరు పప్పులో కాలేసినట్టే . నిజానికి శోభిత ధూళిపాళ్ల ఫేవరెట్ హీరో షారుఖ్ ఖాన్ అంటూ బాలీవుడ్ లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో  బయట పెట్టింది.  అయితే తెలుగులో మాత్రం ఆమె ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్ . ఎస్ జూనియర్ ఎన్టీఆర్ అంటే శోబిత ధూళిపాళ్ళకు చాలా చాలా ఇష్టమట.  ఆయన యాక్టింగ్ స్టైల్ ఎప్పుడు కూడా ఆమెను ఇంప్రెస్ చేసేస్తూ ఉంటుందట . దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: