సోషల్ మీడియాలో స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన వార్తలు ఎప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి అన్న విషయం గురించి మన ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి సంబంధించిన వార్తలు పలు రకాలుగా ట్రెండ్ అవుతూ ట్రోలింగ్ కి గురవుతున్నాయి . ఆయన ఎప్పుడైతే రాజమౌళి సినిమాలో నటించబోతున్నాడు అని తెలిసిందో అప్పటినుంచి ఆయనపై జనాలు కూసింత స్పెషల్ ఫోకస్ ఎక్కువగానే చేస్తూ వచ్చారు . మరి ముఖ్యంగా "గుంటూరు కారం" సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మహేష్ బాబు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్తలను పట్టించుకోవడం మానేశాడు .


దీంతో  జనాలు ఇష్టం వచ్చిన రేంజ్లో ఆయనను ట్రోలింగ్ గి గురి చేస్తున్నారు . మరి ముఖ్యంగా మహేష్ బాబు - రాజమౌళి సినిమా కోసం లుక్స్ కి నెలలు టైం కేటాయిస్తూ ఉన్న విషయాన్ని జనాలు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . తాజాగా ఆయనకున్న ఒక గబ్బు పాడు అలవాటుకు సంబంధించిన వార్త బాగా ట్రెండ్ అవుతుంది . మహేష్ బాబు విపరీతంగా స్మోక్ చేసేవాడట . ఆయన కాలేజీ టైంలో ఈ స్మోకింగ్ హ్యాబిట్ అలవాటు చేసుకున్నారట . ఆ తర్వాత ఎన్నోసార్లు సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు చేత స్మోకింగ్ అలవాటు మానిపించాని అంటూ  ట్రై చేసారట .



కానీ ఆయన వల్ల కానే  కాలేదట . మహేష్ బాబు తల్లి ఇందిరమ్మ కూడా చాలా చాలా ట్రై చేశారట . కానీ మహేష్ బాబు మానేసినట్లే మానేసి మళ్ళీ మొదలుపెట్టే వారట . ఇంట్లో తెలియకుండా ఫ్రెండ్స్ తో ఎక్కువగా స్మోక్ చేసేవారట . ఫైనల్లీ ఆయన చేత స్మోకింగ్ మానిపించిన ఘనత నమ్రతకే దక్కింది. ఆమెను  ప్రేమిస్తున్న టైం లో కూడా మహేష్ బాబు ఎక్కువగా స్మోక్ చేసేవారట . అయితే నమ్రత తనదైన స్టైల్ లో మహేష్ బాబు చేత స్మోకింగ్ అలవాటును మాన్పించేసిందట. ఎంతమంది చెప్పిన వినని మహేష్ బాబు నమ్రత చెప్పిన విధానం ఆమె మాటలు ఆయనను బాగా మార్చేసాయి అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి . ప్రెసెంట్ రాజమౌళి సినిమా కోసం బాగా కష్టపడి పోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.  ఈ సినిమాతో గ్లోబల్ స్థాయి ఇమేజ్ పక్కా అంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: