సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను సాధిస్తూ ఉండడం చూస్తూ ఉంటాము. అయితే ఇలా సూపర్ హిట్ అయిన సినిమాలు కొన్ని కొన్ని సార్లు ఏకంగా అవార్డుల పంట కూడా పండిస్తూ ఉంటాయి. అయితే ఇలా సూపర్ హిట్ అయిన సినిమాలకు అవార్డులు వచ్చాయి అంటే చిత్ర యూనిట్ కి మరింత సరికొత్త ఉత్సాహం నిండిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు ఇండస్ట్రీలో ఏకంగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించడమే కాదు.. ఊహించని రీతిలో అవార్డులను కూడా సొంతం చేసుకుంటూ ఉంటాయి.


 టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇలా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డులను సైతం కొల్లగొట్టిన సినిమా ఒకటి ఉంది. అదే బలగం మూవీ. అప్పటివరకు జబర్దస్త్ కమెడియన్గా కొనసాగిన వేణు ఎల్దండి దర్శకత్వంలో బలగం సినిమా వచ్చింది. మనుషుల మధ్య కనుమరుగైపోతున్న మానవ బంధాలను బంధుత్వాలను గుర్తుచేసే కతాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఎలాంటి అంచనాలు  లేకుండా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఏకంగా కేవలం ఒకే ఒక్క కోటి బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీగా లాభాలను సొంతం చేసుకుంది.


 అంతేకాదు ఏకంగా 100 ఇంటర్నేషనల్ అవార్డులను కూడా దక్కించుకుంది  ఈ విషయాన్ని చిత్ర బృందం ధ్రువీకరించింది.  గోల్డెన్ బ్రిడ్జ్ ఇస్తాంబుల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ లో ఇక ఈ సినిమాకు మూడు అవార్డులు దక్కాయ్. బెస్ట్ ఫీచర్ ఫిలిం, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ లీడ్ యాక్టర్ కేటగిరీలో ఆవార్డులను సొంతం చేసుకుంది. ఇక ఫిలింఫేర్ అవార్డులలో ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు లాంటి అవార్డులను సొంతం చేసుకోగలిగింది బలగం మూవీ. ఒక సినిమా 100 కోట్ల కలెక్షన్స్ సాధిస్తుంది. లేదంటే 100 రోజులు థియేటర్లలో ఆడుతుంది. కానీ మా మూవీ ఏకంగా 100 ఇంటర్నేషనల్ అవార్డులను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది అంటూ చిత్ర యూనిట్ అప్పట్లో అవార్డుల పంట పండడంపై ఏకంగా సంబరాలు కూడా చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: