ఏంటి తన సినిమాలతో ఇండియాని షేక్ చేసిన అక్కినేని నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకుని మరణించాలి అనుకున్నారా.. సూసైడ్ చేసుకోవడం కోసం ఏకంగా సూసైడ్ స్పాట్ కి కూడా వెళ్లారా..ఇంతకీ ఆయనకి వచ్చిన కష్టం ఏంటి.. ఎందుకు సూసైడ్ చేసుకోవాలి అనే అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు అనే సంగతి ఇప్పుడు చూద్దాం.. చాలామంది సీనియర్ హీరోలు సినిమాల్లోకి రావడానికి ముఖ్య కారణం నాటకాలు..వాళ్ళు నాటకాల్లో చేసి నాటక రంగంలో మంచి ప్రశంసలు పొందాక  సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగి రంగుల ప్రపంచం లోకి వచ్చారు. అలా అప్పటి సీనియర్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇలా ఎంతోమంది మొదట నాటక రంగంలో రాణించిన వాళ్లే.అయితే ఏఎన్ఆర్ నాటక రంగంలో రాణించిన సమయంలో ఎక్కువగా ఆడవాళ్ళ వేషాలు వేసేవారట. 

ఇక సినిమాల్లోకి వచ్చాక కూడా కొన్ని సినిమాల్లో ఆడవాళ్ళ పాత్రలు పోషించారు.అయితే లేడి లాగా నటించడంతో కొంతమంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్లు అలాగే ఆయన ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ ని నపుంసకుడు,గే అంటూ అవమానించారట.. చాలాసార్లు వాళ్ల మాటలు పట్టించుకోని ఏఎన్ఆర్ పదేపదే ఆ మాటలతో హింసిస్తూ ఉంటే తట్టుకోలేక ఓ రోజు చెన్నైలోని మెరీనా బీచ్ కి వెళ్లారట.కానీ అదే సమయంలో ఎవరైతే తనను చూసి నవ్వి హేళనగా మాట్లాడుతున్నారో వాళ్లే నా నటనను చూసి పొగిడేలా చేస్తాను అని పట్టుబట్టి మళ్ళీ వెనుతిరిగి సినిమాల్లో తన నటనతో అదరగొట్టారు.

ఇక అప్పట్లో ఏఎన్ఆర్ చేయని పాత్ర అంటూ ఉండదు. ఎలాంటి పాత్ర అయినా సరే అందులో లీనమైపోయి నటించి అబ్బా ఈ హీరో ఎంత బాగా నటిస్తున్నాడో అని అనుకునేలా చేశారు. ఇక ఎవరైతే ఇయన్నీ అవహేళన చేస్తూ మాట్లాడారో వాళ్లే ఇయన్నీ మెచ్చుకున్నారట. అయితే ఈ విషయాన్ని స్వయంగా అక్కినేని నాగార్జున ఏఎన్ఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా  బయటపెట్టారు.అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ మద్రాస్ నుండి హైదరాబాద్ రావడానికి కృషి చేసిన వారిలో మా నాన్న గారి కృషి ఎంతో ఉంది అంటూ నాగార్జున తండ్రి గురించి గొప్పగా చెప్పుకొచ్చారు

మరింత సమాచారం తెలుసుకోండి: