అలాగే మగధీర నిర్మాతగా ఉన్న అల్లు అరవింద్ బడ్జెట్ విషయంలో ఆందోళనకు గురయ్యాడట మగధీర రికవరీ చేయగలదా అని టెన్షన్ కూడా పడ్డారట. నా దగ్గర ఉన్నది మొత్తం సినిమాకి పెట్టేశానని ఆయన రాజమౌళితో ఎప్పుడు అంటూ ఉండేవాడుట. అయితే మగధీర ఇండస్ట్రీ హిట్ కావడంతో అల్లు అరవింద్ కి పెద్ద మొత్తంలో లాభాలు వచ్చాయి .. అంత భారీ హిట్ ఇచ్చిన రాజమౌళికి అల్లు అరవింద్ ఒక్క రూపాయి కూడా లాభాల్లో షేర్ ఇవ్వలేదట. అదేవిధంగా మరోవైపు చిరంజీవి మగధీర హిట్ కావడానికి రామ్ చరణ్ కారణమంటూ ఎప్పుడు మాట్లాడేవారట. అలాగే అల్లు అరవింద్ , చిరంజీవి తీరుకు విసుగు పోయిన రాజమౌళి మెగా హీరోలతో సినిమా చేయకూడదని ఫిక్స్ అయ్యాడని వాదన కూడా అప్పట్లో వచ్చింది.
అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ తో రాజమౌళి ఒక్క సినిమా కూడా చేయలేదు .. అందుకు మగధీర సినిమా సమయంలో జరిగిన విభేదాల కారణమని ఇండస్ట్రీలో కొందరు అంటూ ఉంటారు. ఈ విషయం పక్కన పడితే మగధీర రికార్డులు సైతం ఫేక్ అని రాజమౌళి స్వయంగా గతంలో చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఈ మేరకు ఆయన ఈ సినిమాపై ఆసక్తికర కామెంట్లు చేశారు. ప్రతి స్టార్ హీరో హిట్ సినిమాకు 100 డేస్ థియేటర్స్ నెంబర్స్ పెంచి వేసుకునేవారు ఇదే అందరూ చేసే వారు.. ఇది నాకు చాలా చిరాకు తెప్పించింది. సింహాద్రి కొన్ని థియేటర్స్ లో వంద రోజులు ఆడింది అది జెన్యూన్ గా ఆడింది.. దానికి అందరం ఆనందపడ్డం.
అయితే మగధీర ఇండస్ట్రీ హీట్ అప్పటికి టాలీవుడ్ లో ఉన్న రికార్డ్స్ ని తిరగరాసి భారీ కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాకు దరిదాపుల్లో మరో సినిమా దాదాపు చాలా కాలం రాలేదు. అలాగే 100 డేస్ కి మళ్ళీ నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెంచడం మొదలుపెట్టారు.హిట్ అది. ఆ సినిమాకు దరిదాపుల్లో మరో సినిమా లేదు. 100 డేస్ కి మళ్ళీ నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెంచడం మొదలుపెట్టారు. నేను అరవింద్ తో మనం ఈ బ్యాడ్ కల్చర్ ఆపేద్దాం అనుకున్నాం కదా సర్ అన్నాను. అవును కానీ, అభిమానుల ఒత్తిడి, తప్పలేదు అన్నారు, అని రాజమౌళి చెప్పుకొచ్చారు. రాజమౌళి మాటలతో మగధీర 100 డేస్ థియేటర్స్ రికార్డు ఫేక్. మగధీర 100 రోజుల థియేటర్ల సంఖ్య ఫేక్ అని తేలిపోయింది.