తెలుగు సినిమా ఖ్యాతని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం శంకరాభరణం.. 1980 ఫిబ్రవరి 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. కళాతపస్వి కె విశ్వనాథ్ దర్శకత్వం వహించారు పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై ఏడిద నాగేశ్వరరావు – ఆకాశం శ్రీరాములు నిర్మించారు. ఈ సినిమా ఆరోజుల్లోనే మన తెలుగు రాష్ట్రాలతో పాటు మన సౌత్ అన్ని ఇండస్ట్రీలలో  విడుదలై సంచలన విజయంగాా నిలిచింది. అలాగే ఆరోజుల్లోనే అమెరికాలో రెగ్యులర్ థియేటర్లో విడుదలైన మొట్ట మొదటి తెలుగు సినిమా కూడా ఇదే. అదేవిధంగా అమెరికాతో పాటు ప్రపంచ లో ఉన్న ఎన్నో దేశాల్లో విడుదలై తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించంది ఈ సినిమా.. ఆ రోజుల్లో ఎవ్వరి నోట విన్నా శంకరాభరణం గురించి ప్రస్తావన వచ్చేది.  శాస్త్రీయ సంగీతానికి ఆరాధన కరువైన రోజుల్లో విడుదలైన ఈ సినిమా ఎంతోమందికి ఆ సంగీతంపై ఆసక్తి పెరిగేలా చేసింది. ఈ సినిమా విడుదలైన తర్వాత ఎంతోమంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టారు.


ఇక ప్రతి తెలుగువాడు మా సినిమా అని గర్వంగా చెప్పుకున్నారు. ఇక ఈ సినిమాకు వచ్చిన అవార్డుల విషయానికి వస్తే.. జాతీయ అవార్డులో కళాత్మక విలువలు, వినోదాత్మకంతో కూడిన  జనరంజక చిత్రంగా స్వర్ణ కమలం అందుకుంది. తెలుగులో స్వర్ణ కమలం అందుకున్న తొలి తెలుగు సినిమా కూడా ఇదే. ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం తొలిసారిగా ఈ సినిమాతో ఉత్త‌మ నేప‌థ్య గాయ‌కుడి గా అవార్డు అందుకున్నాడు . అలాగే ఉత్త‌మ గాయ‌నిగా వాణీజ‌యరాం , ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడి గా కేవీ మ‌హ‌దేవ‌న్ అవార్డులు అందుకున్నారు. Besancon ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ( ఫ్రాన్స్ ) లో ఉత్తమ చిత్రంగా అంతర్జాతీయ అవార్డు అందుకుంది. అలాగే 8 నంది అవార్డులు గెలుచుకుంది. ఇక దేశంలోని అనేక సాంస్కృతిక సంస్థలు ఈ చిత్ర బృందాన్ని అవార్డులు , సన్మానాలతో ముంచెత్తాయి .


ఇక శంక‌రాభ‌ర‌ణం సినిమా పై చాగంటి కోటేశ్వర రావు మూడు రోజులు ప్రవచనాలు కూడా నిర్వ‌హించారు . అలా ఓ చిత్రం పై ప్రవచనం నిర్వహించటం అదే మెదటి సారి. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ ఓ ప్రత్యేక గౌరవాన్ని తీసుకొచ్చిందీ శంక‌రాభ‌ర‌ణం. ఇక ఈ సినిమా త‌ర్వాత జేవీ సోమ‌యాజులు ను అంద‌రూ శంక‌రాభ‌ర‌ణం శంక‌ర శాస్త్రి అని పిల‌వ‌డం మొద‌లు పెట్టారు.  అలాగే వాంప్ పాత్రలు ఎక్కువగా చేసే మంజు భార్గవి చాలా పవిత్రమైన‌ తులసి పాత్రలో లీనమైపోయింది . ప్రముఖ హాస్య నటులు అల్లు రామలింగయ్య ఓ కీలక పాత్ర పోషించారు . ఈ చిత్ర పాటలు ఇప్పటికీ భాష తో సంబంధం లేకుండా అందరూ పాడుతూనే ఉంటారు . ఈ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తాను చెన్నై & హైదరాబాద్ లో నిర్మించిన ఇళ్లకు శంకరాభరణం అనే పేరు పెట్టుకున్నారు . 40 సంవత్సరాలు దాటుతున్న ఇంకా ఈ సినిమా ప్రపంచ సినిమా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: