- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . .

ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా .. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు మధ్య గ్యాప్ వచ్చేసింది. సోషల్ మీడియాలో ను .. బహిరంగ వేదికలలోను అటు బన్నీ అభిమానులు ... ఇటు పవన అభిమానులు ఎప్పటికప్పుడు పరస్పరం పై చేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ అభిమానులు బన్నీని టార్గెట్ చేస్తుంటే .. బన్నీ అభిమానులు పవను టార్గెట్ చేస్తున్నారు. దీనికి అంతటికి ప్రధాన కారణం అయిదారు సంవత్సరాల నుంచి బ‌న్నీ పవన్ పేరు ప్రస్తావించే క్రమంలో కాస్త ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో 2015లో వ‌చ్చిన‌ రుద్రమదేవి లో బ‌న్నీ గోన గ‌న్నారెడ్డి పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమా ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలని అభిమానులు కోరినప్పుడు చెప్పను బ్రదర్ అన్న కామెంట్ నుంచి బన్నీ వర్సెస్ పవన్ అన్నట్టుగా వార్‌ ముదురుతూ వస్తోంది.


బన్నీ కూడా పవన్ అభిమానులతో పెట్టుకునే విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గటం లేదు. కాస్త మ‌రింత‌గా రెచ్చ గొట్టేలా మాట్లాడుతున్నారు. తాజాగా రిలీజ్ అయిన బన్నీ పుష్ప 2 సినిమా ట్రైలర్ లో పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా .. ఇంటర్నేషనల్ అన్న డైలాగ్ వదిలారు. అయితే తాజాగా ఈరోజు మహారాష్ట్ర - ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ జరిగింది. ఈ కౌంటింగ్ లో మహారాష్ట్రలో అధికార ఎన్డీఏ కూటమి ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో తెలుగు ప్రజలు అత్యధికంగా ఉన్న కొన్ని ప్రాంతాలలో ప్రచారం చేశారు.


మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో బిజెపి తరఫున ఐదు నియోజకవర్గాలలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు. పవన్ ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలోనూ బిజెపి అభ్యర్థులు ఘన విజయం దూసుకువెళుతున్నారు. ఈ క్రమంలోని నార్త్ ఇండియా లోను పవన్ హ‌వా నడుస్తుందని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్ప సినిమాలో బన్నీ ట్రైలర్ లో చెప్పిన డైలాగ్ టార్గెట్ చేస్తూ పవన్ అంటే లోకల్ అనుకుంటివా .. నేషనల్ అంటూ అభిమానులు .. కూటమి పార్టీ శ్రేణులు కామెంట్లు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: