ఇప్పుడు నాగచైతన్య-శోభిత ధూళిపాళ్ళని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు . డిసెంబర్ 4వ తేదీ వీళ్ల పెళ్లి ఘనంగా అంగరంగ వైభవంగా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే జరగబోతుంది అంటూ అఫీషియల్ గా ప్రకటించాడు నాగార్జున . దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నాగచైతన్య సమంతలకు ఎలాంటి కండిషన్ అయితే అమలా పెట్టిందో .. అదే కండిషన్ మళ్ళీ నాగచైతన్య - శోభిత ధూళిపాళ్లకు పెట్టింది అమలా అంటూ ఓ న్యూస్ సంచలనగా ట్రెండ్ అవుతుంది.
త్వరలోనే నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లి జరగబోతుంది అన్న మూమెంట్లో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . "సమంత ఎలాగో నా మాట వినలేదు.. నువ్వైనా నా మాట విను ..పెళ్లయిన వెంటనే ఒక బేబీని ప్లాన్ చేసుకో.. మీ మధ్య గొడవలు వచ్చిన అన్ని సర్దుకుపోతాయి అంటూ నేను అత్తగారిలా చెప్పడం లేదు ఒక అమ్మల సజెస్ట్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చిందట " అమల .అఫ్ కోర్స్ ఏ అత్తగారి అయినా సరే ఇదేవిధంగా చెబుతారు . అందులో తప్పులేదు . అయితే కొంతమంది అమలా అంటే పడని వాళ్ళు మాత్రం ఈ విషయాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. ఈ రోజుల్లో ఎవరు అలా ఆలోచిస్తున్నారు..? అందరు కెరియర్ లో సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారు ..?అంటూ అమల మాటలు పెడ అర్ధం తీస్తూ ట్రోల్ చేస్తున్నారు . చూడాలి మరి అమల మాటలు శోభిత ధూళిపాళ్ల వింటుందో ..? సమంత లాగే నాకేం సంబంధం లేదు..? అంటూ చేతులెత్తేస్తుందో..?