అది ఒక రొమాంటిక్ ప్రాజెక్ట్ . ఆ తర్వాత కొన్ని కారణాల చేత బడ్జెట్ ప్రాబ్లం కారణంగా ఈ ప్రాజెక్టును ఆపేసారట. అయితే లావణ్య త్రిపాఠి ఆ సినిమాకి చేసిన అగ్రిమెంట్ ని మాత్రం క్యాన్సిల్ చేసుకోలేదట . ఎలాగో సినిమా క్యాన్సిల్ అయిపోయింది కదా అంటూ సైలెంట్ అయిపోయిందట . అయితే మెగా ఇంటికి కోడలు అయిన తర్వాత ఆ స్టేటస్ ఉపయోగించుకొని లావణ్యతో హిట్ కొట్టేలా చేయడానికి ఆ డైరెక్టర్ మరొకసారి ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అగ్రిమెంట్ ని లావణ్యకి పంపిస్తూ ..మీరు ఈ ప్రాజెక్టులో నటించాల్సిందే అంటూ మొండిగా మాట్లాడుతున్నారట .
అయితే లావణ్య త్రిపాఠి ది ఏ మాత్రం తప్పులేదు. అప్పుడు ఆ ప్రాజెక్టుకు కమిట్ అయింది .. ఆ తర్వాత మేకర్స్ ఆ ప్రాజెక్టును క్యాన్సిల్ చేశారు . కానీ ఎందుకు ఇప్పుడు మళ్లీ ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి తీసుకొస్తున్నారు . కావాలనే మెగా ఫ్యామిలీని మెగా ఇంటి పరువును ట్రోల్ చేయడానికి ఇలా చేస్తున్నారా..? అంటూ జనాలు ఫైర్ అయిపోతున్నారు . అయితే లావణ్య త్రిపాఠి కూడా లీగల్ గా ప్రొసీడ్ అవ్వడానికి సిద్ధంగా ఉందట . అంతేకాదు అవసరమైతే ఆయనపై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా ఏమాత్రం వెనకాడడం లేదట. ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే ఈ వార్త పై అటు లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ ఇటు మెగా ఫ్యామిలీ ఏ మాత్రం రెస్పాండ్ కావడం లేదు. సోషల్ మీడియాలో ఇది బాగా ట్రెండ్ అవుతూ వైరల్ అవుతుంది . అయితే కొంతమంది ఇది కావాలని ఎవరో మెగా ఫ్యామిలీ అంటే పడని వాళ్ళు సృష్టిస్తున్న రాద్ధాంతం అంటూ సినిమా ఇండస్ట్రిలో ఇలాంటివి కామన్ అంటూ కొట్టి పడేస్తున్నారు..!