మొదటి నుంచి పుష్ప2 సినిమా పై  అంతా కూడా నెగిటివ్ టాక్ ఎక్కువగా వినిపించడం మనం చూశాం. మరి ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీతో ఉన్న విభేదాలు కారణం అంటూ చాలామంది అభిప్రాయపడ్డారు . అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా పుష్ప2 పై నెగిటివ్ గా మాట్లాడుకోవడం తో బన్ని అభిమానులు బాగా హర్టింగ్ గా అనిపించింది.  ఇదే మూమెంట్ లో పుష్ప2 సినిమా ఫ్లాప్ అయిపోతుంది అంటూ చాలా చాలా వార్తలు వైరల్ అయ్యాయి .


అయితే ఫైనల్లీ పుష్ప 2 టాక్ మారిపోయింది . ఒకే ఒక్క ఆడియో లీక్ తో పుష్ప2 టాక్ పూర్తిగా మారిపోయింది. రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ ఆడియో లీక్ అయింది . ఆ ఆడియో లీక్ లో ఇద్దరు కుర్రాళ్ళు పుష్ప2 సినిమా గురించి మాట్లాడుకోవడం సంచలనంగా మారింది. అల్లు అర్జున్ కెరీర్ ని మలుపు తిప్పే పుష్ప2 సినిమా మొత్తం సోషల్ మీడియాలో పెట్టేస్తామంటూ మాట్లాడుకుంటున్నారు . అంతేకాదు రిలీజ్ కి ముందే పుష్ప 2 సినిమా టోటల్ సోషల్ మీడియాలో లీక్ చేస్తాం అంటూ వాళ్ళ అంత కాన్ఫిడెంట్గా మాట్లాడటం పట్ల చాలామంది బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . దీని వెనక పెద్ద హీరో కుట్ర ఉంది అంటూ అభిప్రాయపడుతున్నారు .



అంతేకాదు ఈ ఆడియో లీక్ పుణ్యమా అంటూ పుష్ప2 సినిమాని ఇండస్ట్రీలో కావాలనే కొందరు పెద్దలు అడ్డుకుంటున్నారు అన్న విషయం బయట పడిపోయింది . దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో బన్ని నటిస్తున్న పుష్ప2కు పాజిటివ్ టాక్ ఏర్పడింది. బన్నీ చాలా కష్టపడి సినిమా కోసం నటించాడు అని .. కావాలనే కొందరు పెద్ద వ్యక్తులు బన్నీ స్థాయిని అడ్డుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారు అంటూ మాట్లాడుకోవడం ప్రారంభించారు జనాలు . దీంతో రాత్రి కి రాత్రి పుష్ప2 సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చేసింది . అంతేకాదు సోషల్ మీడియాలో హ్యూజ్ నెగిటివ్ టాక్ అందుకుంటున్న సరే బన్నీ సినిమాకు సంబంధించి ఎలాంటి కాంట్రవర్షియల్  కామెంట్ చేయలేదు . ఆ మ్యాజిక్ బాగా వర్కౌట్ అయింది . ఫైనల్లీ దేవుడు బన్నీ పక్షాన ఉండి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేలా చేసాడు అంటున్నారు బన్నీ అభిమానులు . చూద్దాం మరి డిసెంబర్ 5వ తేదీ వరకు ఈ టాక్ ఇలానే ఉంటుందో మళ్ళీ మారిపోతుందో..???

మరింత సమాచారం తెలుసుకోండి: