ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన చిత్రం పుష్ప2. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మించిన ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.ఈ చిత్ర యూనిట్ కు కూడా పుష్ప2 అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. డిసెంబరు 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 11,500 స్క్రీన్లలో భారీస్థాయిలో విడుదల చేయబోతున్నారు. తొలిరోజు ఆర్ఆర్ఆర్ సినిమాకు మించి కలెక్షన్లు కొల్లగొట్టాలనేది పుష్ప2 పెట్టుకున్న లక్ష్యం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పూర్తయింది. మొత్తం అన్ని కట్స్ పోను 3 గంటల 20 నిముషాలపాటు సినిమా రన్ టైం ఉంది.ఇదిలావుండగా ‘పుష్ప 2’ లో హీరో ఎంట్రీ డిలే అవుతుందట. దాదాపు 20 నిమిషాల తర్వాతే అల్లు అర్జున్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది. అల్లు అర్జున్ ఎంట్రీ కూడా ఫ్యాన్స్ కి మంచి హై ఇస్తుందని తెలుస్తుంది. సాధారణంగా పెద్ద హీరోల సినిమాల్లో హీరో ఎంట్రీ ఫాస్ట్ గా ఉంటుంది.కానీ ఈ మధ్య చూసుకుంటే.. కథ డిమాండ్ చేయడం వల్ల కావచ్చు, హీరోల ఎంట్రీలు డిలే అవుతున్నాయి. ‘కల్కి 2898 ad’ లో ప్రభాస్ ఎంట్రీ కూడా డిలే అయ్యింది.

ఆ సినిమాలో 22 నిమిషాల వరకు ప్రభాస్ ఎంట్రీ ఉండదు.’దేవర’  లో కూడా ఎన్టీఆర్ ఎంట్రీ 18 నిమిషాల వరకు ఉండదు. ఆ సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు ‘పుష్ప 2’ కూడా అంతేనేమో అంటూ కామెంట్స్ వస్తున్నాయి.ఈ నేపథ్యంలో సెన్సార్ అధికారులు చెబుతున్నదాని ప్రకారం ఊర మాస్ కంటెంట్ తో ప్రేక్షకులను బాగా సినిమా అలరిస్తుందని, అల్లు అర్జున్ తో శ్రీలీల పాట బాగా వచ్చిందని, టోటల్ గా సినిమా మొత్తం చూసిన తర్వాత ప్రేక్షకులు ఉర్రూతలూగిపోవడం ఖాయమని సెన్సార్ రిపోర్ట్. సెన్సార్ కు వెళ్లడానికి ముందు ఈ సినిమాను ముఖ్యుల కోసం అన్నపూర్ణ స్టూడియోలో షో కూడా వేశారు. హీరో, నిర్మాత, దర్శకులతోపాటు, బన్నీ తండ్రి అల్లు అరవింద్ లాంటివారంతా చూశారు. సినిమా పూర్తయిన తర్వాత అల్లు అరవింద్ అల్లు అర్జున్ ను ఆలింగనం చేసుకొని సంతోషపడ్డారు. సినిమా మాత్రం కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంటూ అల్లు అరవింద్ చెప్పారు. వీరంతా చూసిన తర్వాతే సెన్సార్ కు పంపించారు. అక్కడ కూడా అదిరిపోయిందంటూ టాక్ రావడంతో సినిమా యూనిట్ మొత్తం సంతోషంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: