ఈ మధ్యకాలంలో ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా సరే సినిమా ఎలా ఉన్నప్పటికీ ఆ సినిమా కలెక్షన్స్ను బట్టి సినిమా సక్సెస్, ఫెయిల్యూర్, బ్లాక్ బాస్టర్ అనే విషయాన్ని చాలా మంది నిర్ణయిస్తు ఉన్నారు. ముఖ్యంగా చాలా సినిమాలు గతంలో ఉన్న రికార్డులు అన్నిటినీ కూడా బద్దలు కొట్టాలని పలు రకాల ప్రయత్నాలు చేసిన సందర్భాల్లో ఉన్నాయి. అలా ఇప్పుడు టాలీవుడ్ నుంచి మోస్ట్ అవైడేడ్ చిత్రం పుష్ప-2 చిత్రం ప్రస్తుతం కలెక్షన్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.


డిసెంబర్ 5వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతున్న పుష్ప-2 చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్ అనిపించేలా ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప-2 సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ బాహుబలి-2 నీ బీట్ చేయాలనే టార్గెట్ తో అల్లు అర్జున్ బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. అందుకే టికెట్ల రేటు పెంపు కోసం పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే టికెట్లు ధరలు పెంచుకోవడానికి పరిమిషన్ కూడా లభించిందట. అంతే కాకుండా రేటు కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. మొదటివారం ఒకలాగా ఆ తర్వాత మరొక లాగా రేటు ఉండేలా ఫిక్స్ చేశారట.


గతంలో విడుదలైన చిత్రాలకు రూ.150 నుంచి రూ.200 రూపాయల వరకు పెంచుకొని అవకాశం కల్పించారట. కానీ ఇప్పుడు పుష్ప-2 కు రెండు లేదా మూడు ఇంతలా రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ అడుగుతున్నారని టాక్ వినిపిస్తోంది .. అంటే 200 రూపాయలకు కల్కి సినిమాని పెంచితే పుష్ప-2 కు 300 రూపాయలు అనమాట. స్టార్ హీరోల కంటే మరొక 25% అదనంగా టికెట్లు రేటు పెంచడానికి గట్టిగానే అల్లు అర్జున్ ట్రై చేస్తున్నారని సమాచారం. బాహుబలి-2 ఫస్ట్ డే కలెక్షన్స్ రూ .200 కోట్ల ప్లస్ గ్రాస్ అయినట్లు లెక్కలు చెబుతున్నాయి దీని బట్టి చూస్తే ఇప్పుడు పుష్ప-2 సినిమా రూ .250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో  రికార్డ్ సృష్టించిన ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: