ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ.. కొంతమేరకు మాత్రమే ఆస్తులను సంపాదించుకుంటూ ఉంటారు. అయితే కోలీవుడ్ లో సూపర్ స్టార్ గా పేరుపొందిన రజనీకాంత్ వాస్తవ విలువ సుమారుగా రు.450 కోట్లకు ఉంటుంది.. అలాగే బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన రణబీర్ కపూర్ ఆస్తి 350 కోట్లకు పైగాని ఉంటుంది.టాలీవుడ్ అల్లు అర్జున్ ఆస్తి విలువ కూడా రూ .450 కోట్లకు పైగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి .అయితే ఇప్పుడు వీరందరి కంటే ఎక్కువగా ఒక హీరో ఆస్తి ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది ఆ హీరో ఎవరో చూద్దాం.


అడపా దడపా చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన నటుడు, హీరో వివేక్ ఒబెరాయ్. ఈయన ఆస్తి సుమారుగా 1200 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం. బాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలలో నటించి అత్యంత విలాసమైన ఖరీదైన వాహనాలలో కూడా తిరుగుతూ ఉంటారట. వివేక్ ఒబెరాయ్ సినిమాలలో నటించింది తక్కువైన తన దగ్గర ఉన్న ఆస్తి మాత్రం చూస్తే అందరిని ఆశ్చర్యపరిచేలా ఉంటుంది. ఈయన సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ లో తక్కువ అయితే ఈయన వ్యాపార సామ్రాజ్యంలో మాత్రం బాగా సక్సెస్ అయ్యారు. గత రెండు దశాబ్దాలుగా స్థాపించిన కొన్ని బిజినెస్ల వల్లే తాను కోటీశ్వరుడు అయ్యారని విషయం ఇప్పుడు తెలుస్తోంది.

2002లో కంపెనీ అనే చిత్రం ద్వారా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన వివేక్ ఒబెరాయ్.. ఆ తర్వాత స్టార్ గా పేరు సంపాదించారు. ఐశ్వర్యరాయ్ తో కూడా రిలేషన్ షిప్ మైంటైన్ చేశారని కొన్ని కారణాల చేత విడిపోయారని వార్తలు కూడా గతంలో వినిపించాయి. ఇక సౌత్ ఇండస్ట్రీలో చాలా పట్టుదలతో ప్రయత్నించాడు ముఖ్యంగా రక్త చరిత్ర సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాగే మలయాళం లో కూడా లూసిఫర్ సినిమాలో నటించారు. ఇండియాలో అత్యంత సంపన్నమైన నటులలో ఒకరిగా పేరు సంపాదించారు

మరింత సమాచారం తెలుసుకోండి: