టాలీవుడ్లో బడా సినిమాలతో పాటు.. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అందించే నిర్మాణ సంస్థలలో ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ ఒకటి. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సన్నిహితులకు చెందిన ఈ సంస్థ ఎన్నో పెద్ద సినిమాలు నిర్మించింది. అయితే ఈ బ్యానర్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులను తెరకెక్కిస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర సినిమాను ఈ సంస్థ నిర్మిస్తుండగా.. మరో రెండు కొత్త ప్రాజెక్టులు కూడా లైన్లో పెట్టింది.
అయితే విశ్వంభర సినిమాను .. నెక్స్ట్ సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. అయితే విశ్వంభర సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడంతో .. నిర్మాతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై టాలీవుడ్ లో బాగా ప్రచారం జరుగుతుంది. అంతేకాదు విశ్వంభర సినిమా డీల్స్ .. ఇంకా క్లోజ్ కాలేదన్న ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పటికే భారీ ఎత్తున పెట్టుబడి పెట్టేశారు. సినిమా డీల్స్ ఇంకా క్లోజ్ కాకపోవడంతో.. అమౌంట్లు వెనక్కు రాలేదు. ఈ క్రమంలోనే యూవీ క్రియేషన్స్ తెరకెక్కించబోయే మరో రెండు కీలక ప్రాజెక్టుల నుంచి ఈ సంస్థ బయటకు వచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ రెండూ కూడా క్రేజీ కాంబినేషన్లు కావడం విశేషం.
గోపీచంద్ , జిల్ - రాధేశ్యామ్ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కునున్న సినిమా నుంచి యూవీ క్రియేషన్స్ తప్పుకుందని సమాచారం. అలాగే మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్.. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబినేషన్లో తెరకెక్కే సినిమాలను కూడా యూవీ క్రియేషన్స్ వదులుకుందని సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే.. యూవి క్రియేషన్స్ క్లారిటీ ఇచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.