బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మలైక ఆరోరా కూడా యోగ చేయడంతో పాటు మద్దతుగా పలు కార్యక్రమాలు కూడా చేస్తారు .. అలాగే తాను ఫిట్టిగా ఉండటంతో పాటు ముంబైలో యోగ స్టూడియో ని కూడా నడుపుతున్నారు ఈ సీనియర్ హీరోయిన్. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి యోగా సాధకురాలు మాత్రమే కాదు యోగా టీచర్ .. అనుష్క యోగా చేయటంలో మాస్టర్స్ చేసింది .. ప్రతి ఒక్కరి జీవితంలో యోగ ఒక భాగం కావాలని ఈమె ప్రచారం కూడా చేస్తుంది. మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ కూడా అందంగా ఫిట్ గా ఉండటానికి ఏరియల్ యోగ, మరియు సూర్య నమస్కారం తో పాటు యోగ ఆసనాలు వేస్తారు. ఇదే తనకు ఆరోగ్యకరమైన జీవనశైలికి మారుపేరుగా మారాయని ఆమె చెబుతూ ఉంటారు.
మరో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్స్ శ్రియ కూడా పెళ్లయి పిల్లలు ఉన్న తర్వాత కూడా ఇంత అందంగా నాజుగా ఉండడానికి కారణం.. ఆమె రోజు చేసే యోగ ఎంతో ఫిట్‌గా ఉంచుకుంటుంది. తన శరీరంపై తాను పట్టు సాధించి తో పాటు తనను తాను కంట్రోల్ చేసుకోగలదని కారణం యోగా అని ఎప్పుడూ చెబుతారు శ్రియ. మరో సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష కూడా 40 సంవత్సరాలు వచ్చినా కూడా ఎంతో నాజుగా ఉండడానికి కారణం యోగానే తనకు ఇష్టమైన వ్యాయామంగా యోగాను ఉపయోగిస్తుంది త్రిష జిమ్ లో ఇబ్బంది పడే బదులు ఇంట్లో ప్రశాంతంగా యోగా చేయటం మేలు అని ఈ స్టార్ హీరోయిన్ అంటుంది.