మా నిర్మాతలకు నాపై ప్రేమ కంటే ఆరోపణలే ఎక్కువ అని నేరుగా ఆయన చెప్పాడు.. ఇకపై సుకుమార్‌తో దేవిశ్రీ సినిమా చేయకపోవచ్చు అని కూడా పలువురు అంచనా వేస్తున్నారు. పుష్ప బిజిఎం విషయంలో తమన్‌ని ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ చేశారు .. బిజిఎం వరకు తమన్ అందిస్తారని తెలుస్తుంది .. పరోక్షంగా ఈ విషయాన్ని నిర్మాతలు ఒప్పుకున్నారు ఇది కూడా దేవిశ్రీకి నచ్చకపోయి ఉండవచ్చు అని కూడా అంటున్నారు. తమన్ కంటే దేవిశ్రీ ఎంతో సీనియర్ గతంలో ఈ ఇద్దరు ఒకే మ్యూజిక్ డైరెక్టర్ వద్ద కలిసి పనిచేశారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్ కావడానికి ఒక పది సంవత్సరాలు ముందే దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్గా మారారు. ఒక జూనియర్ ని తన ప్రాజెక్టులోకి తీసుకురావటం దేవిశ్రీకి కోపం తెప్పించి ఉండవచ్చు.. అయితే తమన్ బిజిఎం ని పుష్ప 2కి వాడటం లేదా తమన్ బిజిఎం నచ్చకపోవచ్చు లేదా దేవిశ్రీకే ఆ బాధ్యత కూడా ఇద్దామని అనుకోవచ్చు.
ఈ వార్త టాలీవుడ్ లో ఎంతో హాట్ టాపిక్ గా మారింది డిసెంబర్ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటే వారం రోజుల్లో ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇప్పటికి కూడా పుష్ప2 ఫైనల్ వెర్షన్ ఇంకా రెడీ కాలేదు. అలాగే మ్యూజిక్ విషయంలో కూడా ఇంకా గందరగోళమే నడుస్తుంది. రీసెంట్ గానే ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సినిమాకి సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చిందని అంటున్నారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని తెర్కక్కించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ రెమినేషన్ దాదాపు 300 కోట్లు అంటున్నారు. రష్మిక మందాన హీరోయిన్. ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగపతి బాబు కీలక రోల్స్ చేస్తున్నారు. అన్ని హక్కులు కలిపి పుష్ప 2 రూ. 1000 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం.