చిత్ర పరిశ్రమ లో నటిగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది .. కానీ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తో ప్రేమ కోసం ఇండస్ట్రీని వదిలి పారిపోయింది .. మాఫియా డాన్ ప్రేమలో  పడి సినిమాలను వదులుకొని హిమాలయాలకు పారిపోయింది .. తనే ఒకప్పటి హీరోయిన్  మమతా కులకర్ణి .. ఆమె నటించిన బ్లాక్ బస్టర్ మూవీ కరణ్ అర్జున్ .. 1995లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయమందుకుంది . ఈ సంవత్సరంతో ఈ సినిమా 30 ఏళ్ళను పూర్తి చేసుకోనుంది. దీంతో ఈ సినిమాని మళ్లీ థియేటర్లో విడుదల చేయాలని దర్శ‌కుడు కూడా భావిస్తున్నాడు . అప్పట్లో ఈ సినిమా తొలి వారంలోని దాదాపు కోటి రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టింది.


దీంతో ఇప్పుడు ఈ సినిమాని మరల రిలీజ్ చేసే పనిలో పడ్డారు దర్శకుడు రాకేష్ రోషన్ .. ఈ సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు .. అయితే ఈ సినిమాలో నటించిన ఒకప్పటి హీరోయిన్ మమత కులకర్ణి కూడా కీలక పాత్ర పోషించారు .. అయితే ఇప్పుడు ఈ సీనియర్ నటి ఎక్కడ ఉన్నారు .. ఎలా జీవిస్తుంది అనేది ఎవరికీ తెలియదు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు రాకేష్ రోషన్ .. మమత కులకర్ణి గురించి పలు  ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఆ ఇంటర్వ్యూలో రాకేష్ రోషన్ సీనియర్ హీరోయిన్ గురించి అడగక ... నేను  మమత కులకర్ణి తో చాలా సంవత్సరాలుగా టచ్ లో లేను వాళ్ళు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు అంటూ .. రాకేష్ సమాధానం ఇచ్చారు .


మమత కులకర్ణి దాదాపు 22 సంవత్సరాల క్రితం సినిమా ప్రపంచానికి వీడ్కోలు చెప్పింది . 2002లో విడుదలైన ‘కభీ తుమ్‌ కభీ హమ్‌ సినిమా తర్వాత ఈమె మరి ఏ సినిమాలోని కనిపించలేదు . ఒకప్పుడు స్టార్ హీరోయిన్ల జాబితాలో మమత అగ్రస్థానంలో ఉన్నారు . అండర్ వరల్డ్ దావూద్ తో ఎఫైర్ ఈ నటి జీవితాన్ని మొత్తం నాశనం చేసింది. మమతా కులకర్ణి పలు సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రల్లో నటించి అభిమానులను సొంతం చేసుకుంది. ‘ఆషిక్ ఆవారా’, ‘క్రాంతివీర్’, ‘వక్త్ హమారా హై’, ‘కరణ్ అర్జున్’, ‘చైనా గేట్’ చిత్రాల్లో కనిపించింది. నివేదికల ప్రకారం, 2014లో మమత ఇండస్ట్రీని వదిలి ఆధ్యాత్మికత బాట పట్టిందని వార్తలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: